Digital Money Transaction : అందుబాటులోకి వచ్చిన తర్వాత అందరూ దీనినే ఫాలో అవుతున్నారు. బ్యాంకులో డబ్బులు ఉన్నా బ్యాంకుకు వెళ్లి తీసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అంతేకాకుండా అత్యవసర సమయంలో బ్యాంకులో అందుబాటులో ఉండవు. అందువల్ల బ్యాంకులో ఉన్న డబ్బులు తీసుకోవడానికి ఏటీఎంలను ఏర్పాటు చేశారు. ఏటీఎంలో ద్వారా ఎప్పుడైనా మనీని విత్డ్రా చేసుకోవచ్చు. అయితే ఏటీఎం సెంటర్లలో మనీ ఉంటేనే వీటిలో అవుతుందన్న విషయం గుర్తు ఉంచుకోవాలి. దీంతో చాలా మంది మొబైల్ లో ఉన్న ఫోన్ పే, గూగుల్ పే యాప్ ల ద్వారా మనీ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు. వీటిలో ఉండే యూపీఐ ద్వారా మనీ అని సెండ్ చేస్తూ రిసీవ్ చేసుకుంటారు. అయితే ఒక్కోసారి డబ్బులు పంపించినా లేదా ఎవరి నుంచి అయినా తీసుకోవాలని అనుకున్నా.. ట్రాన్సాక్షన్ చేసే సమయంలో బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి.. కానీ రిసీవర్ అనుకున్న మనీని పొందలేరు.ఇలా కట్ అయిన డబ్బులు తిరిగి అకౌంట్ లోకి రావాలంటే చాలా సమయం పడుతుంది. ఒక్కోసారి కొన్ని బ్యాంకులు వారాల కొద్ది సమయం కూడా తీసుకోవచ్చు. అయితే ఈ సమస్య పరిష్కారానికి ఒక మార్గం ఏర్పడింది. అదేంటంటే?
Also Read : డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు.. ఖాళీలు, అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇవీ..
యూపీఐ ట్రాన్సాక్షన్లో డబ్బులు డ్రా చేసుకున్న తర్వాత బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. అయితే నగదు మాత్రం రాదు. ఈ పరిస్థితి ఎదురైనప్పుడు వెంటనే బ్యాంకులోకి వెళ్ళగానే సిబ్బంది చెప్పే మాట ఏంటంటే రిఫండ్ అవుతాయని అంటారు. అయితే ఎన్ని రోజులు అని మాత్రం ఖచ్చితంగా చెప్పరు. ఇప్పటివరకు ఈ పరిస్థితి ఎదురైన వాళ్ళు ఒక్కోసారి వారం దాటిన డబ్బులు రికవరీ కానీ సంఘటనలు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని RBI Harmonisation of Turn Round Time And Customer Compensation అనే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఖాతాదారుడు తన బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిన కొద్ది రోజుల్లోనే రికవరీ పొందవచ్చు.
ఇకనుంచి ఏ బ్యాంకు ఖాతాదారుడు అయినా తన ఏటీఎం నుంచి లేదా యూపీఐ నుంచి మనీ ట్రాన్సాక్షన్ చేస్తే బ్యాంకు నుంచి నగదు కట్ అయిన 1+3 రోజుల్లో తిరిగి ఖాతాదారుడికి సదరు ఏటీఎం బ్యాంక్ చెల్లించాలి. అలాగే ఒక వ్యాపారి కి ఈ పరిస్థితి ఏర్పడితే 1+5 రోజుల్లో రికవరీ చేయాలి. ఇలా చేయని పక్షంలో ఫిర్యాదు చేయవచ్చు. ఈ నియమాల ప్రకారం బ్యాంకు వారు డబ్బులు రికవరు చేయలేని పక్షంలో ఆ తర్వాత రోజు నుంచి రోజుకు రూ 100 చొప్పున ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.
అయితే ఈ విషయంలోనూ బ్యాంకులో నిర్లక్ష్యం చేస్తే National payment corporation of India వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చు. ఇందులో ట్రాన్సాక్షన్ అనే ఆప్షన్ లోకి వెళ్లి విత్ డ్రాయల్ అమౌంట్ గురించి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో బ్యాంకు నుంచి డబ్బులు కట్ అయిన రోజు నుంచి త్రీ ప్లస్ వన్ మినహాయించి మిగతా రోజుల జరిమానాను చెల్లిస్తారు. అందువల్ల ట్రాన్సాక్షన్ చేసే ఖాతాదారుడు ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు.
Also Read : మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా.. నామినీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి