Bank Account : ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి అయింది. కొందరికీ ఒకటి మించి బ్యాంక్ అకౌంట్లు ఉంటున్నాయి. మీరు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు నామినీని యాడ్ చేశారా ? ఒక వేళ నామినీని యాడ్ చేయకుండటే తక్షణమే ఆ పని పూర్తి చేయండి. ఇలా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కు నామినీని యాడ్ చేయడం ద్వారా మీ మరణానంతరం మీరు సంపాదించిన డబ్బులు మీకు ఇష్టమైన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుతాయి. సాధారణంగా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడే బ్యాంకు అధికారులు నామిని పేరు యాడ్ చేయాలని సూచిస్తారు. అది సేవింగ్స్ అకౌంట్ అయినా లేక ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ అయినా సరే నామినీ వివరాలు అందించాలని బ్యాంకులు అడుగుతాయి. అకౌంట్ హోల్డర్ మరణించిన సమయంలో అందులోని డబ్బులను తీసుకునేందుకు ఆ ఖాతాదారుడు అధికారం ఇచ్చే వ్యక్తినే నామినీగా పేర్కొంటారు.
బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు దరఖాస్తు ఫారమ్ నింపాల్సి ఉంటుంది. అందులో నామినేషన్ సెలక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. మీరు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే ఒకరి పేరు మాత్రమే నామినీగా ఎంచుకోవచ్చు. సాధారణంగా కుటుంబ సభ్యుల్లోని భార్య, భర్త, పిల్లలు, తోబుట్టువుల పేర్లు సెలక్ట్ చేసుకోవచ్చుచ. లేకపోతే దగ్గర వాళ్లు, ఇష్టమైన వారిని ఎవరినైనా నామినీగా ఎంచుకోవచ్చు. ఒక వేళ మీరు మైనర్లను నామినీగా ఎంచుకుంటే మరో వ్యక్తిని గార్డియన్ గా పెట్టుకోవాల్సి ఉంటుంది.
Also Read : మీకు తెలియకుండా మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యాయా.. ఇదే కారణం.. వెంటనే ఇలా చేయండి !
అకౌంట్ హోల్డర్ కు సంబంధించిన నామినీ వివరాలు నమోదు కానీ కారణంగా వేలాది మంది ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అవగాహన లోపం కారణంగా చాలామంది ఖాతాదారులు నామినీ పేరు చేర్చడం లేదు. దీంతో బ్యాంకు నిబంధనల ప్రకారం నామినీ పేరు నమోదుకాని ఖాతాదారుడు చనిపోయిన సందర్భాల్లో ఆయన భార్య, సంతానం ఇలా అందరూ కలసి ఏకాభిప్రాయంతో నామినీగా ఒకరి పేరును సూచిస్తూ దరఖాస్తు ఫారంపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఆస్తుల వివాదాలు, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేక, ఆ సొమ్ము తమదంటే తమదంటూ పోటీపడడం వల్ల ఎక్కువ మంది ముందుకు రావడం లేదు.ఈ కారణంగా బ్యాంకులు ఖాతాలోని సొమ్ము లేదా ఇతరత్రాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. రిజర్వు బ్యాంకు ఖాతాలకు మళ్లిస్తున్నాయి.
కొంతమంది నామినీని యాడ్ చేసి కూడా మరిచి పోతున్నారు. ఒక వేళ బ్యాంక్ ఖాతాకు నామినీ యాడ్ చేశామా ఎలా తెలుసుకోవాలో చూద్దాం. సాధారణంగా బ్యాంకులో ఖాతా ఓపెన్ చేసినప్పుడే నామినీ యాడ్ చేస్తుంటారు. కొన్ని సందర్బాల్లో అలా జరుగదు. అయితే, తాము నామినీ యాడ్ చేశామో లేదో చాలా మంది గుర్తుంచుకోరు. అయితే, ఖాతా నామినేషన్ వివరాలు చెక్ చేయడం, కొత్తగా నామినీ యాడ్ చేసేందుకు బెస్ట్ ఆఫ్షన్ ఏంటంటే మీ దగ్గర్లోని బ్రాంచ్ కు వెళ్లడమే. అలాగే మీరు ఆన్‌లైన్ ద్వారాను చెక్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం చాలా బ్యాంకులు మీ నామినేషన్ వివరాలను ఆన్‌లైన్ లో చెక్ చేసుకునేందుకు, అప్డేట్ చేసేందుకు అంగీకరిస్తున్నాయి. మీకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఖాతా ఉన్నట్లయితే ఆన్‌లైన్ ద్వారా ఎలా చెక్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మీరు హెచ్‌డీఎఫ్‌సీ నెట్ బ్యాంకింగ్ లాగిన్ కావాలి. మీ సేవింగ్స్ అకౌంట్ లోకి వెళ్లాలి. అక్కడ మీ సేవింగ్స్ ఖాతా బ్యాలెన్స్ కనిపిస్తుంది. అక్కడ కనిపించే ఫిగర్‌పై క్లిక్ చేయాలి. అది మిమ్మల్నిఅకౌంట్ సమ్మరీ పేజీకి తీసుకెళ్తుంది. అక్కడ మీకు నామినీ అనే ఆప్షన్ అవుపిస్తుంది. ఇప్పటికే నామినీని మీరు నామినీ యాడ్ చేసినట్లయితే అక్కడే తెలుస్తుంది. దానిని మీరు మార్చుకోవచ్చు. అందుకు ఛేంజ్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత మాడిఫై లేదా యాడ్ న్యూ నామినీ ఆప్షన్ ఉంటుంది. మీ నామినేషన్ మార్చుకుని మాడిఫై ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
Also Read : ఆర్బీఐ కీలక నిర్ణయం.. జనవరిలో మూడు రకాల బ్యాంక్ ఖాతాలు క్లోజ్.. వీటిలో మీ ఖాతా ఉందా చెక్ చేసుకోండి ?