టీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్.. టీడీపీలో చంద్రబాబు, లోకేష్.. అలానే తమిళనాట కూడా ఇప్పుడు కరుణానిధి చనిపోయాక డీఎంకే పార్టీకి స్టాలిన్ అధ్యక్షుడిగా అంతా తానై వ్యవహరిస్తున్నారు.. ఇక ఆయన భార్య దుర్గ సీఈవో లెవల్లో పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తుంటారు. కొడుకు ఉదయనిధి యూత్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ప్రాంతీయ పార్టీల్లో అధ్యక్షులే రాజులు.. వాళ్ల కుటుంబ సభ్యులదే పెత్తనం..
Also Read: కాంగ్రెస్ ఇంత డేరింగ్ స్టెప్ తీసుకుందేంటి..? దెబ్బకి కేసీఆర్ వణికిపోయాడు
అయితే అందరు వారసులు అధికారం చేపట్టలేరు. అందరికీ రాజ్యాధికారం దక్కలేదు. అందరూ ప్రజల్లో నిరూపించుకోలేదు. ఎన్నికల్లో గెలవదు.. గెలిచిన వారే రాజు.. ఆ రాజ్యానికి అన్నీ..
ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్ నామస్మరణ వినిపిస్తోంది. నిజామాబాద్ ఎమ్మెల్యేలు కేటీఆర్ ను సీఎం చేయాలంటూ నినదించారు. ఏకంగా స్వయంగా కేసీఆర్ ను కోరడం హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణలో కేటీఆర్ నిరూపించుకున్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి గెలిచాడు. హైదరాబాద్ జీహెచ్ఎంసీని క్లీన్ స్వీప్ చేశాడు. పలు ఎమ్మెల్యే ఎన్నికల్లో వారిని గెలిపించాడు. ఎంపీలను స్వంతంగా గెలిపించాడు.
Also Read: కేంద్ర మంత్రి పదవి వీరిద్దరికి ఖాయమేనా?
అయితే టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు మాత్రం గెలిపించడం పక్కనపెడితే తనే గెలవలేకపోయాడు. తొలిసారి పోటీచేసిన మంగళగిరిలో ఓడిపోయాడు. ఇక నాన్న చంద్రబాబు సపోర్టుతో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యాడు. ఇక టీడీపీ పాలనలో చిన్నబాబు ఫెయిల్ అయ్యాడనే అపవాదు ఉంది. తండ్రి తగ్గ వారసత్వాన్ని కంటిన్యూ చేయలేదని.. ఆయనను చాలా మంది టీడీపీ నేతలే వ్యతిరేకిస్తున్నారు.
మొత్తం తెలంగాణ సీఎం పగ్గాలు చేపట్టడానికి కేటీఆర్ వడివడిగా సాగుతుంటే.. అదే సమయంలో ఆయనకు ప్రధాన పోటీదారు అయిన లోకేష్ బాబు మాత్రం ఇంకా చాలా వెనుకబడ్డట్టే కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఇద్దరినీ పోలిస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోందని పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
-ఎన్నం