దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ఈ రంగం, ఆ రంగం అనే తేడా లేకుండా అన్ని రంగాలపై వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ అమలు వల్ల ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తినడానికి తిండి దొరకని పరిస్థితులు నెలకొనడంతో చాలామంది తల్లిదండ్రులు పిల్లల చదువు గురించి సైతం ఆలోచించడం మానేశారు. కొందరు అతి కష్టం మీద దాచుకున్న డబ్బులో కొంత మొత్తం పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తున్నారు.
Also Read: పాపం.. ఈ కాకి ఏం తప్పు చేసింది? తెల్లగా పుట్టడమే దీని తప్ప?
కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో భారీ మొత్తంలో ఫీజులు కట్టలేని స్థితిలో సామాన్య, మధ్య తరగతి వర్గాలు ఉన్నాయి. వీళ్ల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఒక కాలేజీ పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుంది. కేవలం ఒక్క రూపాయి ఫీజు వసూలు చేస్తూ విద్యార్థులపై జాలి, దయ చూపిస్తోంది. కరోనా కాలంలోను తల్లిండ్రులను పీడించుకొని తింటున్న కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులకు ధనదాహానికి చెంపపెట్టులా ఒక రూపాయి ఫీజు తీసుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది.
Also Read: మీకు తెలుసా? ఈ చీరతో కరోనా అంతం!
పశ్చిమబెంగాల్ లోని నైహతిలో ఉన్న రిషి బంకిమ్ చంద్ర కాలేజీ ప్రతి సంవత్సరం అండర్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ల కోసం 3500 రూపాయల నుంచి 11 వేల రూపాయలు ఫీజుగా తీసుకునేది. అయితే అంఫన్ తుఫాన్, కరోనా, లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో ఈ సంవత్సరం కేవలం ఒక్క రూపాయి మాత్రమే అడ్మిషన్ ఫీజుగా తీసుకుంటోంది. కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంజిబ్ కుమార్ సాహా తమ కాలేజీకి వచ్చే విద్యార్థులకు పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వాళ్లు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.