https://oktelugu.com/

పదో తరగతి పరీక్షలు ఎప్పుడెప్పుడు రద్దయ్యాయో తెలుసా?

తెలంగాణలో తరగతి పరీక్షలు కొనసాగిస్తారా? లేదా అనే సస్పెన్స్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారమే ముగింపు పలికారు. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో రాష్ట్రంలో పదో తరగతి చదువుతున్న 5.34లక్షల మంది విద్యార్థులకు ఊరట లభించింది. వీరంతా పరీక్షలు రాయకుండా పై తరగతులకు ప్రమోట్ అయ్యారు. ప్రతీయేటా పదో తరగతి విద్యార్థులకు నిర్వహించి ప్రీ ఫైనల్ పరీక్షల్లోని మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్ రూపొందించే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 9, 2020 / 04:43 PM IST
    Follow us on


    తెలంగాణలో తరగతి పరీక్షలు కొనసాగిస్తారా? లేదా అనే సస్పెన్స్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారమే ముగింపు పలికారు. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో రాష్ట్రంలో పదో తరగతి చదువుతున్న 5.34లక్షల మంది విద్యార్థులకు ఊరట లభించింది. వీరంతా పరీక్షలు రాయకుండా పై తరగతులకు ప్రమోట్ అయ్యారు. ప్రతీయేటా పదో తరగతి విద్యార్థులకు నిర్వహించి ప్రీ ఫైనల్ పరీక్షల్లోని మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్ రూపొందించే పనిలో పడింది. ఇదిలా ఉంటే పదో తరగతి పరీక్షలు గతంలో ఎప్పుడెప్పుడు రద్దయ్యాయి అనే అంశంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో చర్చ మొదలైంది.

    తెలంగాణ కరోనా విభృంభిస్తుండటంతో హైకోర్టు హైదరాబాద్, రంగారెడ్డి మినహా రాష్ట్రమంతటా పదో పరీక్షలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అందరికీ ఒకేసారి పరీక్షలు నిర్వహించే మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలోనూ పదో తరగతి పరీక్షలు రద్దయిన సంఘటనలు తెలంగాణలో ఉన్నాయి. గత 51ఏళ్లలో తెలంగాణలో పదో విద్యార్థులు నేరుగా ప్రమోట్ కావడం ఇది మూడోసారిగా తెలుస్తోంది.

    1951-52లో నిజాం రాష్ట్రంలో ముల్కీ ఉద్యమం పెద్దఎత్తున జరిగింది. నాలుగు నెలలపాటు ఉద్యమం ఉవ్వెత్తున సాగడంతో అప్పట్లో పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోలేదు. ఆ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొలడంతో పదో తరగతి పరీక్షల్ని రద్దు చేసి విద్యార్థులను ప్రమోట్ చేశారు. అదేవిధంగా 1969లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. ఆ సమయంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించటం సాధ్యం కాదని నాటి అధికారులు ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. దీంతో ప్రభుత్వం నామమాత్రంగా పరీక్షలు నిర్వహించి అందరూ పాస్ అయినట్లు ప్రకటించింది. తాజాగా కరోనా వైరస్ కారణంగా తెలంగాణలో పదో తరగతి పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ నిర్ణయంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.