Russia Ukraine War Vladimir Putin: రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవాలన్న ఆశతో యుద్ధం మొదలుపెట్టిన రష్యాకు అడుగడుగునా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఏ మూహుర్తాన యుద్ధం మొదలు పెట్టిందో గానీ.. రష్యా ఇప్పుడు ప్రపంచ దేశాలకు విలన్ గా మారింది. ప్రపంచ దేశాలన్నీ రష్యాపై వివిధ రకాలుగా ఆంక్షలు విధించడంతో ఆ దేశం ఒంటరి గా మిగిలిపోయింది. అటు 13 రోజులుగా భీకర యుద్ధం చేసినా చిన్న దేశమైన ఉక్రెయిన్ ను ఆక్రమించుకోలేకపోయాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. దీంతో యుద్ధం ప్రారంభించి తప్పు చేశామా…? అనే ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. అంతేకాకుండా యుద్ధం కొనసాగించినా.. విరమించినా.. పుతిన్ కు మాయని మచ్చ ఏర్పడే అవకాశం లేకపోలేదు.

సోవియట్ యూనియన్ నాటి పరిస్థితులను తీసుకురావాలని పుతిన్ కలలు గన్నాడు. ఇందులో భాగంగా క్రిమియాను ఆక్రమించుకున్నట్లే ఉక్రెయిన్ ను కూడా సొంతం చేసుకుంటే పూర్వ రోజులు వచ్చినట్లేనని భావించారు. అయితే ఉక్రెయిన్ మాత్రం కాస్త గట్టిగానే నిలబడింది. అంతేకాకుండా మొదటి నుంచి యూరోపియన్ భావాలున్నా ఈ దేశానికి ఈయూ దేశాలు ఫుల్ సపోర్టుగా నిలబడ్డాయి. దీంతో ఈయూ అండతో కదనరంగంలోకి దిగింది ఉక్రెయిన్. అయితే యుద్ధం ప్రారంభంలో ఉక్రెయిన్ అనుకున్నట్లు సాగలేదు. ఈయూ దేశాలు అండగా నిలబడుతాయని ఊహించింది. కానీ యుద్ధానికి నేరుగా సాయం చేయలేమని చెప్పాయి. దీంతో ఆందోళనకు గురైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఇక రష్యాకు చేజిక్కనున్నామా..? అని అనుకున్నారు. కానీ ఈయూ దేశాలు ఉక్రెయిన్ కు నేరుగా సాయం చేయలేకపోయినా రష్యాపై రకరకాలుగా ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. ఉక్రెయిన్ కు అవసరమైన ఆయుధాలను పంపిస్తూ.. రష్యాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
Also Read: రష్యా ఉక్రెయిన్ యుద్ధం.. ఈ వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశాలు?
ఓవైపు యుద్ధానికి పరోక్షంగా సాయం చేస్తూ మరోవైపు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా ఒంటరిగా మారిపోయింది. ప్రముఖ ఆర్థిక సంస్థలన్నీ రష్యాను వీడుతున్నాయి. అమెరికా, బ్రిటన్ ఇతర దేశాలకు చెందిన సంస్థలన్నీ తమ కార్యకలాపాలను రష్యాలో రద్దు చేసుకుంటున్నాయి. దీంతో రష్యా ప్రజలు సైతం తమ జీవనం అల్లకల్లోలం చేస్తన్న ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ పై తిరగబడే రోజులచ్చినట్లు తెలుస్తోంది. అయితే పుతిన్ కు ఉన్న అధికార బలం అక్కడి నిరసనకారులను కంట్రోల్ లో పెడుతోంది. కానీ ఇతర దేశాల నుంచి సేవలన్నీ నిలిచిపోవడంతో రష్యా పరిస్థితి రాను రాను దారుణంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.

ఉక్రెయిన్ కు యూరోపియన్ దేశాల మద్దతు ఉంటుందని చెప్పినా యుద్ధం ప్రారంభంలో సైనిక బలగాలను దించలేదు. ఉక్రెయిన్ నాటో సభ్యత్వ దేశం కానందున బలగాల సాయం చేయలేమని అమెరికా, తదితర దేశాలు తేల్చి చెప్పాయి. దీంతో మొదట్లో రష్యాకు ఉక్రెయిన్ చిక్కే ప్రమాదం ఉందని భావించారు. కానీ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ రణమో.. ప్రాణమో.. అంటూ ధైర్య సాహాసాలను ప్రదర్శించడంతో ఆ దేశ సాధారణ పౌరులు సైతం యుద్ధంలోకి దిగారు. మనదేశాన్ని మనమే కాపాడుకుందాం.. అంటూ పౌరులు తుపాకులు చేత బట్టారు. ఇలా రష్యా సైనికులను అడుగడుగునా అడ్డుకున్నారు. ఉక్రెయిన్ పౌరుల పోరాటపటిమ చూసిన కొన్ని దేశాలు వారికి ఆహారం, ఇతర సదుపాయాలను కల్పించింది.
అయితే మిలటరీ బలగాలను పంపించాలని ఉక్రెయిన్ కోరినా పశ్చిమ దేశాలు మాత్రం ఒప్పుకోలేదు. దీంతో దేశ ప్రజలను సైనికులుగా మార్చిన ప్రెసిడెంట్ జెలెన్ స్కీ రష్యాతో ఒంటరిగానే పోరాడాడు. తమ దేశంలోని ప్రధాన నగరాలైన కీవ్, ఖార్కివ్ లపై బాంబుల దాడులు కురుస్తున్నా నెరవలేదు. అయితే చివరి వరకు పోరాటం చేస్తానని చెప్పి13 రోజులైనా రష్యాకు లొంగలేదు. దీంతో చిన్న దేశాన్ని ఆక్రమించుకోవడానికి రష్యా పెద్ద సాహసమే చేయాల్సి వస్తోంది. అంతేకాకుండా ప్రపంచ దేశాలన్ని రష్యాపై విధిస్తున్న ఆంక్షలతో రష్యాలో జీవన పరిస్థితులు మారిపోయాయి. రష్యాతో ఎగుమతులు, దిగుమతులు రద్దు చేసుకోవడంతో అక్కడి పరిస్థితి ధీనంగా మారిపోయింది. మరి పుతిన్ ఇప్పటికైనా యుద్ధం ఆపే నిర్ణయం తీసుకుంటాడా..? అని ఎదురుచూస్తున్నారు
Also Read: మోడీ వ్యూహాలు రాష్ట్రాల్లో పనిచేయవా?