KCR- Unemployment: కేసీఆర్ ను నిరుద్యోగులు కరుణిస్తారా?

KCR- Unemployment: తెలంగాణ సర్కారు నిరుద్యోగులతో చెలగాటం ఆడుతోంది. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది. దీనిపై నిరుద్యోగులు గుర్రుగా ఉన్నారు. కేసీఆర్ ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి అధికారంలోకి వచ్చి తరువాత మరిచిపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదిగో నోటిఫికేషన్ , ఇదిగో ప్రకటన అంటూ ఆలస్యం చేస్తుండటంతో నిరుద్యోగుల్లో ఆగ్రహావేశాలు పెరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవడం లేదని నిట్టూరుస్తున్నారు. భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరికలు చేస్తున్నారు. […]

Written By: Srinivas, Updated On : March 9, 2022 10:24 am
Follow us on

KCR- Unemployment: తెలంగాణ సర్కారు నిరుద్యోగులతో చెలగాటం ఆడుతోంది. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది. దీనిపై నిరుద్యోగులు గుర్రుగా ఉన్నారు. కేసీఆర్ ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి అధికారంలోకి వచ్చి తరువాత మరిచిపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదిగో నోటిఫికేషన్ , ఇదిగో ప్రకటన అంటూ ఆలస్యం చేస్తుండటంతో నిరుద్యోగుల్లో ఆగ్రహావేశాలు పెరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవడం లేదని నిట్టూరుస్తున్నారు. భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరికలు చేస్తున్నారు. ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వేస్తామని చెబుతున్నా ఆచరణలో కనిపించడం లేదు.

CM KCR

దీంతోనే నిరుద్యోగులు కేసీఆర్ వైఖరిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. ఇన్నాళ్లుగా ఉద్యోగాల భర్తీకి సిద్ధంగా ఉండటం లేదని దుయ్యబడుతున్నారు. కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తామని చెబుతున్నారు. దీంతో కేసీఆర్ కూడా ఉద్యోగాల కల్పనకు భారీ కసరత్తు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. అసెంబ్లీ వేదికగా ఉద్యోగాలపై ప్రకటన చేయనున్నారని సమాచారం. నిరుద్యోగుల ఆశలు నెరవేరేలా భారీగా ఉద్యోగాలు కల్పించేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ సర్కారు వచ్చినప్పటి నుంచి ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టలేదు. దీంతో సహజంగానే నిరుద్యోగులకు ఆగ్రహం పెరిగింది. ప్రభుత్వ నిర్వాకంపై పెదవి విరుస్తున్నారు. ఉద్యోగాల కల్పనకు ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో వారిలో నిర్లిప్తత ఆవహించింది. నాగార్జున సాగర్, దుబ్బాక, హుజూర్ నగర్, హుజురాబాద్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగుల ఆశలు మాత్రం తీరలేదు. దీంతోనే ఈ సారి కూడా తమ ఆశలు గల్లంతే అని నిట్టూరుస్తున్నారు. బడ్జెట్ లో ఉద్యోగాల భర్తీ గురించి ప్రకటన ఉంటుందని ఆశించినా అది కూడా కనిపించలేదు.

CM KCR

తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేశామని చెబుతున్నా అందులో వాస్తవం లేదు. ఇప్పటి వరకు పెద్ద నోటిఫికేషన్ ఒక్కటి కూడా విడుదల చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని వాపోతున్నారు. ఇటీవల నిరుద్యోగులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న సందర్భంలో సర్కారు ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Tags