https://oktelugu.com/

Bheemla Nayak Special Show: పవన్ మేనియా.. లేడీ పోలీసుల కోసం ‘భీమ్లా నాయక్’ స్పెషల్ షో..

Bheemla Nayak Special Show: పోలీస్ డ్యూటీ చేసే మహిళలకు తీరిక దొరకడం చాలా కష్టం. డ్యూటీ లేదంటే ఇంటి పనులతో సతమతవయ్యే లేడీ పోలీసుల కోసం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ స్పెషల్ షో ఆఫర్ చేశారు. నిత్యం బిజీగా గడిపే మహిళా పోలీసులకు కాస్త ఎంటర్మైన్మెంట్ అందించాలనే ఉద్దేశంతో ఈ స్పెషల్ షోను ఏర్పాటు చేసినట్లు సీవీ ఆనంద్ చెప్పుకొచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 9, 2022 / 09:19 AM IST

    Bheemla Nayak Box Office Collections

    Follow us on

    Bheemla Nayak Special Show: పోలీస్ డ్యూటీ చేసే మహిళలకు తీరిక దొరకడం చాలా కష్టం. డ్యూటీ లేదంటే ఇంటి పనులతో సతమతవయ్యే లేడీ పోలీసుల కోసం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ స్పెషల్ షో ఆఫర్ చేశారు. నిత్యం బిజీగా గడిపే మహిళా పోలీసులకు కాస్త ఎంటర్మైన్మెంట్ అందించాలనే ఉద్దేశంతో ఈ స్పెషల్ షోను ఏర్పాటు చేసినట్లు సీవీ ఆనంద్ చెప్పుకొచ్చారు.

    Pawan Kalyan Rana

    మహిళా దినోత్సవం సందర్భంగా నిన్న హైదరాబాద్ లోని జీవీకే మాల్ లో హైదరాబాద్ పరిధిలో వివిధ స్థాయిల్లో పని చేసే మహిళా పోలీసులు 1200 మంది ‘భీమ్లా నాయక్’ స్పెషల్ షోకు టికెట్లు బుక్ చేశారు. మహిళలు పోలీసింగ్ చేయడం చాలా కష్టం అని అయినా కూడా మహిళలు ఎలాంటి భయం లేకుండా తమ డ్యూటీ చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. అటు మహిళా పోలీసు అధికారులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.

    Also Read:  బుల్లి తెర ప్రభాకర్ కూతురు హీరయిన్ కి ఎ మాత్రం తీసుపోదు

    కాగా ఎప్పుడూ డ్యూటీ లేదంటే ఫ్యామిలీతో బిజీగా ఉండే మహిళా పోలీసులకు సీపీ సీవీ ఆనంద్ ఇచ్చిన సినిమా చూసే ఆఫర్ నిజంగా సంతోషానిచ్చింది. కాగా మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మార్చి 8వ తేదిన మహిళలకు సెలవు ప్రకటించడం తెలిసిందే.

    Bheemla Nayak

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రాణాలు ప్రధాన పాత్రల్లో నటించిన ‘భీమ్లా నాయక్’.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబుతున్న విషయం తెలిసిందే. అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య సాగే పోరాటం నేపథ్యంలో సాగే ఈ కథకు అన్ని రకాల కమర్షియల్ హంగులు ఉండటంతో సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. విడుదలైన అన్ని చోట్ల ‘భీమ్లా నాయక్’ కలెక్షన్లతో అదరగొడుతూ ముందుకు సాగుతుండటం తెలిసిందే.

    Also Read: షాకింగ్: ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుకు ప్రమాదం.. సర్జరీ.. వేలు తొలగింపు

    Tags