Modi vs TRS: అనకోకుండా చేశారో లేదంటే ప్లాన్ ప్రకారమే చేశారో తెలియదు గానీ.. ఇప్పుడు మోడీ పార్లమెంట్ సాక్షిగా చేసిన కామెంట్లు ఎంతలా దుమారం రేపుతన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలంగాణ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీఆర్ ఎస్, కాంగ్రెస్ లు ఏకిపారేస్తున్నాయి. పైగా 1991లో కాకినాడ తీర్మానాన్ని గుర్తు చేసి మరీ రాష్ట్ర బీజేపీని ఇరకాటంలో పడేస్తున్నాయి. మరి మోడీకి ఇలా జరుగుతుందని తెలియంది కాదు. ఎంతో ముందు జాగ్రత్తతోనే ఆయన ఇలాంటి కామెంట్లు చేశారనే వాదన కూడా వినిపిస్తోంది.

అయితే ఇలాంటి కామెంట్లు చేస్తే తెలంగాణ ఏర్పడటం ఆయనకు ఇష్టం లేదనే వాదన టీఆర్ ఎస్ ఎత్తుకుంటుందని ఆయనకు తెలియంది కాదు. మరి ఆయన ఏ ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియట్లేదు గానీ.. అంతిమంగా టీఆర్ ఎస్‌కు ఈ కామెంట్లు బూస్ట్ ఇస్తున్నాయి. తెలంగాణకు బీజేపీ వ్యతిరేకం అంటూ టీఆర్ ఎస్ మండిపడుతోంది. ఏకంగా మోడీ దిష్టి బొమ్మలు దహనం చేసి, నిరసనలకు పిలుపునిచ్చింది.
Also Read: కాంగ్రెస్ తప్పులు సరే.. అధికారంలో ఉండి మీరు చేసిందేమిటి..? మోదీకి పలు ప్రశ్నలు
హరీశ్ రావు, కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి మరీ కాకినాడ తీర్మానాన్ని తెరమీదకు తీసుకు వచ్చి అసలు తెలంగాణను మోసం చేసిందే బీజేపీ అని, అందుకే అంతమంది యువత చనిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు బీజేపీ నేతలు తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఈ కామెంట్లతో పటాపంచలు అయిపోయేలా కనిపిస్తున్నాయి. అసలు బీజేపీ అంటేనే తెలంగాణ వ్యతిరేకి అనే ముద్ర వేసే పనిలో పడ్డారు టీఆర్ ఎస్ నేతలు.
ఇక కేసీఆర్ రాజ్యాంగం మీద చేసిన కామెంట్ల మీద ఇన్ని రోజులు బీజేపీ రచ్చ చేస్తే.. ఇప్పుడు వాటిని ఓవర్ కమ్ అయ్యేందుకు టీఆర్ ఎస్‌కు ఈ కామెంట్లు పెద్ద అస్త్రంలా పనిచేస్తున్నాయి. ఇక ఇటు రాష్ట్ర బీజేపీ నేతలు కూడా దీని మీద ఎలాంటి కామెంట్లు చేసే పరిస్థితుల్లో లేరు. మొత్తంగా రాష్ట్రంలో ఎదగాలని చూస్తున్న బీజేపీకి మోడీ కామెంట్ల రూపంలో పెద్ద షాకే తగిలిందని చెప్పొచ్చు.
Also Read: సమ్మె చేయాలని ఉద్యోగులను చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ రెచ్చగొడుతున్నారా?
కాగా టీఆర్ ఎస్‌కు తెలంగాణ తెచ్చిన క్రెడిట్ దక్కకుండా ఉండే క్రమంలో మోడీ ఇలాంటి కామెంట్లు చేశారనే వాదన వినిపిస్తున్నా.. అంతిమంగా ఆయన చేసిన కామెంట్లు టీఆర్ ఎస్‌కే మేలు చేసేలా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. మరి దీని మీద రాష్ట్ర బీజేపీ నేతలు ఏమైనా స్పందిస్తారో లేదో అన్నది వేచి చూడాలి.
TRS MLA Jeevan Reddy Reaction On PM Modi Comments

[…] […]