https://oktelugu.com/

TS Tenth Exams: తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు ఇది గొప్ప శుభవార్త

TS Tenth Exams:  కరోనా కల్లోలంలో దాదాపు సగం రోజులు స్కూళ్లు మూతపడ్డాయి. తీవ్రత తగ్గి మళ్లీ ఇటీవలే మొదలయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటికే రెండు సంవత్సరాల పాటు విద్యావ్యవస్థ కుంటుపడింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆన్ లైన్ క్లాసులతో విద్యార్థులకు సిలబస్ అర్థం కాక.. ఇబ్బందులు పడుతున్నారు. పరీక్షలు అంటేనే భయపడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం పరీక్షలకు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు శుభవార్త చెప్పింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : February 9, 2022 / 06:07 PM IST
    Follow us on

    TS Tenth Exams:  కరోనా కల్లోలంలో దాదాపు సగం రోజులు స్కూళ్లు మూతపడ్డాయి. తీవ్రత తగ్గి మళ్లీ ఇటీవలే మొదలయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటికే రెండు సంవత్సరాల పాటు విద్యావ్యవస్థ కుంటుపడింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆన్ లైన్ క్లాసులతో విద్యార్థులకు సిలబస్ అర్థం కాక.. ఇబ్బందులు పడుతున్నారు. పరీక్షలు అంటేనే భయపడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం పరీక్షలకు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు శుభవార్త చెప్పింది.

    విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు పరీక్ష పేపర్లు తగ్గించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.

    ఇప్పటివరకూ పదోతరగతి పరీక్షల్లో మొత్తం 11 సబ్జెక్టులకు పరీక్ష రాసేవారు. అయితే తాజాగా అన్ని పేపర్లను సింగిల్ పేపర్ కే పరిమితం చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకూ ఒక్కో సబ్జెక్ట్ కు రెండు పేపర్లు ఉండగా.. తాజాగా ఒక్క పేపర్ మాత్రమే పెట్టనున్నారు. మొత్తం 100 మార్కులకు ఆయా పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందులో 80 మార్కులు బోర్డ్ ఎగ్జామ్స్ కు కేటాయించగా.. 20 మార్కులు ఇంటర్నల్స్ కు ఉంటాయి.

    పదోతరగతి పరీక్షలపై ప్రధానోపాధ్యాయులకు కీలక మార్గదర్శకాలను విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో రెగ్యులర్ టెన్త్ , ఓపెన్ టెన్త్ ఒకసారి ఫెయిలైన విద్యార్థుల ఆన్ లైన్ డేటా సేకరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

    ఇక ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను కూడా తెలంగాణ ఇంటర్ బోర్డ్ విడుదల చేసింది. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ను మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకూ.. థియరీ పరీక్షలను ఏప్రిల్ 11 , 12 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.