Vastu Tips: మీ ఇంట్లో ఈ సమస్యలు ఉన్నాయా.. అయితే వాస్తు దోషాలు ఉన్నట్టే?

Vastu Tips:  మనలో చాలామంది లైఫ్ లో సక్సెస్ కావాలనే ఆలోచనతో శక్తికి మించి కష్టపడుతుంటారు. అయితే కొన్నిసార్లు మన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కదు. కొన్నిసార్లు వాస్తుదోషాల వల్ల కూడా మనం అనుకున్న ఫలితాలు దక్కకపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయో లేవో చాలామందికి అర్థం కాదు. అయితే కొన్ని సమస్యలు మీ ఇంట్లో ఉంటే మాత్రం వాస్తు దోషాలే అందుకు కారణమయ్యే అవకాశం అయితే ఉంది. ఇంటిని […]

Written By: Kusuma Aggunna, Updated On : February 10, 2022 4:30 pm
Follow us on

Vastu Tips:  మనలో చాలామంది లైఫ్ లో సక్సెస్ కావాలనే ఆలోచనతో శక్తికి మించి కష్టపడుతుంటారు. అయితే కొన్నిసార్లు మన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కదు. కొన్నిసార్లు వాస్తుదోషాల వల్ల కూడా మనం అనుకున్న ఫలితాలు దక్కకపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయో లేవో చాలామందికి అర్థం కాదు. అయితే కొన్ని సమస్యలు మీ ఇంట్లో ఉంటే మాత్రం వాస్తు దోషాలే అందుకు కారణమయ్యే అవకాశం అయితే ఉంది.

Vastu Tips

ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించినా ఇంటి నిర్మాణం సమయంలో ఏదైనా పొరపాటు చేస్తే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు. సంతాన సమస్యలు, వృథా ఖర్చులు, సంపాదించిన డబ్బులో కొంత మొత్తం కూడా పొదుపు చేయలేకపోవడం, ఊహించని ఆర్థిక సమస్యలు ఎదురుకావడం, ఇతరులతో గొడవలు, కుటుంబ సభ్యులతో గొడవలు ఉంటే వాస్తు దోషాలు అయ్యే అవకాశం ఉంది.

Also Read: హాట్ టాపిక్ గా వ‌రుణారెడ్డి పేరు.. వివేకా హ‌త్య కేసు నిందితుల గుండెల్లో గుబులు..?

కచ్చితంగా సక్సెస్ సాధిస్తామని అనుకున్న పనుల్లో ఎదురుదెబ్బలు తగలడం, ప్రతిరోజూ చేపట్టిన పనులకు ఆవాంతరాలు ఎదురవుతూ ఉండటం కూడా వాస్తుదోషాలకు సంకేతమని చెప్పవచ్చు. రోజురోజుకు ఆర్థిక కష్టాలు పెరగడం, ఆరోగ్య సమస్యలతో పాటు మానసిక సమస్యలు తరచూ వేధిస్తూ ఉండటం కూడా వాస్తు దోషాలకు సంకేతమని చెప్పవచ్చు. ఇంటిలో ఒకరికంటే ఎక్కువమంది ఆరోగ్య సమస్యలతో బాధ పడుతుంటే కూడా వాస్తు దోషాలు అయ్యే ఛాన్స్ ఉంది.

వాస్తు దోషాలు ఉంటే ఇంటి మెయిన్ డోర్ దగ్గర ప్రతిరోజూ దీపాన్ని వెలిగించడంతో పాటు ఇంట్లో నీరు ఎక్కడా వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధాన ద్వారం దగ్గర లక్ష్మీదేవి, వినాయకుల ఫోటోలను ఉంచాలి. తలుపులను తెరిచే సమయంలొ శబ్దం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పూజగదిలో పూజలు చేయడంతో పాటు ఇంట్లో ఏదో ఒక మూలన కుండీ ఉంచి అందులో దీపం వెలిగించాలి.

Also Read: హైదరాబాద్ లో వీధికుక్కను వదలని కామాంధుడు.. శృంగారం చేస్తూ కెమెరా చేతికి చిక్కాడు