https://oktelugu.com/

Nagarjuna: నాగార్జున కోసం జగన్ అంత పని చేశాడా?

Nagarjuna:ఏపీలో టికెట్ల రేట్ల వ్యవహారం.. నాలుగు షోలు ఇతర సినీ ఇండస్ట్రీ సమస్యలపై ఇన్నాళ్లు పట్టుదలగా ఉన్న జగన్ సర్కార్ ఇప్పుడు సడెన్ గా నిబంధనలు సడలించడం వెనుక కథేంటి? అని అందరూ ఆరాతీస్తున్నారు. అయితే అదంతా తనకు సన్నిహితుడైన నాగార్జున కోసమే అన్న చర్చ సాగుతోంది. ఇటు చిరంజీవి సహా సినీ పెద్దలు , నిర్మాతలు థియేటర్లు ఓపెన్ చేయాలని.. టికెట్ రేట్లను సవరించాలని స్వయంగా సీఎం జగన్ ను, మంత్రి పేర్ని నానిని కోరినా […]

Written By:
  • NARESH
  • , Updated On : October 14, 2021 5:21 pm
    Follow us on

    Nagarjuna:ఏపీలో టికెట్ల రేట్ల వ్యవహారం.. నాలుగు షోలు ఇతర సినీ ఇండస్ట్రీ సమస్యలపై ఇన్నాళ్లు పట్టుదలగా ఉన్న జగన్ సర్కార్ ఇప్పుడు సడెన్ గా నిబంధనలు సడలించడం వెనుక కథేంటి? అని అందరూ ఆరాతీస్తున్నారు. అయితే అదంతా తనకు సన్నిహితుడైన నాగార్జున కోసమే అన్న చర్చ సాగుతోంది.

    ఇటు చిరంజీవి సహా సినీ పెద్దలు , నిర్మాతలు థియేటర్లు ఓపెన్ చేయాలని.. టికెట్ రేట్లను సవరించాలని స్వయంగా సీఎం జగన్ ను, మంత్రి పేర్ని నానిని కోరినా కూడా జగన్ సర్కార్ స్పందించలేదు. కానీ ఇప్పుడు నాగార్జున కుమారుడు అఖిల్ సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ’ విడుదల సందర్భంగా జగన్ థియేటర్ల విషయంలో మినహాయింపులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

    అసలే అఖిల్. టాలీవుడ్ లో సరైన హిట్స్ లేక ఆపసోపాలు పడుతున్నాడు. అఖిల్ కెరీర్ ను గాడిలో పెట్టడానికి సీరియస్ గా నాగార్జున ప్రయత్నాలు చేస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం నుంచి ఆయనకు గుడ్ న్యూస్ లభించింది. చాలాకాలంగా మూడు షోలు, 50శాతం అక్యూపెన్సీకే పరిమితమైన షోలను తాజాగా ఫుల్ గా నడిపించేందుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమాకు వరంగా మారింది.

    జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిమ్మగడ్డ ప్రసాద్ కూడా ఉన్నాడు. నిమ్మగడ్డ స్వయానా నాగార్జునకు వ్యాపార భాగస్వామి. సీఎం జగన్ తోనూ నాగార్జునకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఏం లాబీయింగ్ చేశాడో తెలియదు కానీ.. తాజాగా ఇప్పటివరకు సినిమా థియేటర్ల విషయంలో ఆంక్షలు పెట్టిన ఏపీ సర్కార్ తాజాగా థియేటర్లకు 100శాతం అక్యూపెన్సీ తో నడిపించుకోవాలని అనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది నాగార్జున కుమారుడు ‘అఖిల్’ సినిమాకు వరంగా మారింది. ఎంతైనా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అంటున్నారు. అదే ఇప్పుడు నాగార్జున విషయంలో చోటుచేసుకుంది.