AP Employees: ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల పరిస్థితి అధ్వానంగా మారుతోంది. ఒకటో తేదీన ఇవ్వాల్సిన వేతనాలు నెలాఖరులో ఇస్తున్నారు. ఒక్కోసారి ఇంకా ఆలస్యం అవుతోంది. దీంతో వారు జీతమో రామచంద్రా అంటూ నిట్టూరుస్తున్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య అగాధం పెరుగుతోంది. ఉద్యోగ సంఘాలు ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రభుత్వ నిర్వాకాన్ని తగ్గిస్తున్నారని భావించి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్టారెడ్డి వారికి ఫోన్ చేసి బెదిరించినట్లు వార్తలు రావడం సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య పడటం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరును వారు ఎండగడుతున్నారు. తమకు సరైన సమయంలో వేతనాలు అందడం లేదని వాపోతున్నారు.

ప్రభుత్వ సలహాదారు సజ్జల వివరణ ఇస్తూ ఇకపై మొదట ఉద్యోగుల వేతనాలు చెల్లించాకే మిగతా కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. వేతనాలు, పింఛన్లు చెల్లించినాకే ప్రభుత్వ పథకాల జోలికి వెళతామని భరోసా కల్పించారు. దీంతో వారు శాంతించినట్లు చెబుతున్నారు. రెండు ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచి మిగతా సంఘాలను పిలవకపోవడంతో ఉద్యోగ సంఘాల్లో కూడా ఆగ్రహం పెరుగుతోంది. ఒకటో తారేఖునే వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆచరణలో అది సాధ్యమేనా అని ఉద్యోగుల్లో సంశయం వస్తోంది.
కేవలం రెండు సంఘాలనే పిలవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. రెండు సంఘాల నేతలే పని చేస్తున్నారా? మిగతా వారు పని చేయడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ నిర్ణయం పలు వివాదాలకు దారి తీస్తోంది. వారిలో అనుమానాలు రేకెత్తిస్తోంది. టైంపాస్ మీటింగులతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందే తప్ప సమస్య పరిష్కారానికి చొరవ చూపడం లేదని తెలుస్తోంది.
Also Read: MAA Elections: ప్చ్.. అసలు ప్రకాష్ రాజ్ కి ఏమైంది ?
నెలాఖరులోగా పీఆర్సీ ప్రకటిస్తామని సజ్జల చెప్పారు. కానీ ఐఆర్ ఎంత ఉందో పీఆర్సీ కూడా అంతే ప్రకటించి లెక్క సమానం చేసే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్క రూపాయి కూడా పెరగకుండా చేస్తారని తెలుస్తోంది. దీంతో ఉద్యోగ సంఘాల్లో అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగానే సమాధానం ఇస్తోంది.
Also Read: AP power crisis: ఏపీ విద్యుత్ కష్టాలకు జలవిద్యుత్ తో చెక్