Telugu Heroines New Trend: ఈ మధ్య కాలంలో ముఖ్యంగా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కు ఆదరణ పెరిగిన తరుణం దగ్గర నుంచి తెలుగు బ్యూటీలకు అవకాశాలు పెరిగాయి. నిజానికి తెలుగు భామలు హీరోయిన్ పాత్రలకు సూట్ అవ్వరు, అందుకే హీరోయిన్ పాత్రలకు ముంబై నుంచి వచ్చిన వారినే పెట్టుకుంటాం అని ఫిల్మ్ మేకర్స్ చెబుతూ ఉంటారు. కానీ తరం మారింది, కొత్త కాలం వచ్చింది. ఇప్పుడు ఇషా రెబ్బా, రీతూ వర్మ లాంటి తెలుగు అమ్మాయిలనే హీరోయిన్లుగా ఎంచుకుంటున్నారు.

అయినా, పెద్ద హీరోల సినిమాలకు మాత్రం ఇంకా తెలుగు హీరోయిన్లను పెట్టుకోవడం లేదు. తెలుగు హీరోయిన్లను పెట్టుకుంటే లోకల్ టేస్ట్ ఉంటుందని, కమర్షియల్ గా నష్టాలు వస్తాయని.. అన్నిటికీ మించి తెలుగు హీరోయిన్లు, ముంబై హీరోయిన్లు కంటే బెటర్ గా ఉండరు అని అందుకే. ముంబై, కేరళ ముద్దుగుమ్మలకే అవకాశాలు ఇస్తున్నాం అని మొత్తానికి తెలుగు సినిమా దర్శకులు క్లారిటీ ఇస్తున్నారు.
నిజమే, తెలుగు హీరోయిన్లు ముంబై భామలకు పోటీ ఇవ్వలేరు. మరి తెలుగు హీరోలందరూ హృతిక్ రోషన్లు.. బాలీవుడ్ బాద్షాలు కాదు కదా, మరెందుకు ? తెలుగు హీరోల ప్లేస్ ల్లో హిందీ హీరోలను పెట్టుకోరు. అలా ఎట్టిపరిస్థితిలో పెట్టుకోరు కదా. అలాటప్పుడు జస్ట్ హీరోయిన్లకు మాత్రమే, ఈ పిచ్చ సిద్దంతాలు, మద్దతులు ఎందుకు ? ఏది ఏమైనా ఇండస్ట్రీలో ఇన్ని లాజిక్కులు ఇన్ని కండీషన్స్ ఉన్నప్పటికీ..
తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా వస్తున్నారు. రోజురోజుకు ఎదుగుతున్నారు. నిజానికి ఇపుడున్న పరిస్థితుల్లో ఒక తెలుగు అమ్మాయి హీరోయిన్ గా రావడం.. సినిమాలు చేయడం చాలా కష్టం. ముఖ్యంగా దిగుమతి భామల దిగజారుడు తనం ఫోటోషూట్లతో పోటీపడుతూ అవకాశాలు తెచ్చుకోవాలంటే.. తెలుగు భామలు కూడా పరిధి దాటాల్సి వస్తోంది.
Also Read: Balakrishna: బాలయ్య గొప్పతనానికి ఇదే నిదర్శనం !
ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్లు చేస్తూ తెలుగు అందాల ఘాటును పబ్లిక్ గా చూపించాల్సి ఉంటుంది. అందుకే, ఈ మధ్య కాలంలో రీతూ వర్మ, ఈషా రెబ్బా, అనన్య నాగళ్ళ లాంటి భామలు హాట్ ఫోటో షూట్ లకు సై అంటున్నారు. పైగా ఆ హాట్ ఫోటోలను తమ ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటూ ఫిల్మ్ మేకర్స్ దగ్గర తమను తాము ప్రమోట్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు.
Also Read: Prabhas: డబుల్ యాక్షన్ లో ప్రభాస్ క్రేజీ యాక్షన్ ?