Baba Siddiqui murder case : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు సిద్ధిఖి దగ్గర అయినందువల్లే హత్య చేసి ఉంటారని ముంబై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కేసులో పోలీసులు కొంతమందిని అరెస్టు చేశారు. అందులో ఇద్దరు తాము బిష్ణోయ్ అనుచరులమని పోలీసుల ఎదుట పేర్కొన్నారు. సిద్దిఖి ని కాల్చిన వారిలో ఒక వ్యక్తి పేరు కర్నైల్ సింగ్. ఇతడు హర్యానా ప్రాంతానికి చెందినవాడు. రెండవ వ్యక్తి ధరమ్ సింగ్ కశ్యప్. ఎక్కడిది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. మీరు కొంతకాలంగా సిద్ధిఖి ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. ఆ తర్వాత శనివారం రాత్రి కాల్పులు జరిపారు.. కొంతకాలంగా సల్మాన్ ఖాన్ ను లారెన్స్ బిష్ణోయ్ టార్గెట్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ గ్యాంగ్ కు చెందిన కొంతమంది వ్యక్తులు సల్మాన్ ఖాన్ ను వెంబడిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు ప్రసరమవుతున్నాయి. లారెన్స్ గ్యాంగ్ కు చెందిన వ్యక్తులు సల్మాన్ ఖాన్ ఇంటివద్ద రెండుసార్లు రెక్కి నిర్వహించారు. రెడీ సినిమా షూటింగ్లో ఉండగా ఒకసారి.. మరోసారి ప్రాంతంలోని సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ వద్ద.. వ్యక్తికి పాల్పడ్డారు. అంతేకాదు సల్మాన్ ఖాన్ నివాసం ఉంటున్న లాక్సీ అపార్ట్మెంట్ పై ఇటీవల కాల్పులకు తెగబడ్డారు. అమెరికాలో ఉంటున్న లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ ఈ గ్యాంగ్ కు నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది.. అప్పట్లో సల్మాన్ ఖాన్ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ పై జరిగిన కాల్పుల ఘటనలో అన్మోల్ ప్రధాన నిందితుడు అంటూ వార్తలు వినిపించాయి. అయితే అప్పట్లో సల్మాన్ ఖాన్ అపార్ట్మెంట్ పై కాల్పులు జరిపిన దుండగులతో అన్మోల్ సిగ్నల్ యాప్ ద్వారా మాట్లాడినట్టు తెలుస్తోంది. అందులోనే వారికి ఆదేశాలు జారీ చేశాడని సమాచారం.
మాకు శత్రువే
ఇటీవల లారెన్స్ సన్నిహితుడు రోహిత్ మీడియాతో మాట్లాడాడు..” సల్మాన్ ఖాన్ కు మిత్రుడిగా ఉన్నవాడు మాకు శత్రువని” వ్యాఖ్యానించాడు.. కాగా, సిద్ధఖి కి సల్మాన్ ఖాన్ తో ఎప్పటినుంచో స్నేహం ఉందని తెలుస్తోంది. అంతేకాదు గతంలో షారుక్ – సల్మాన్ ఖాన్ బద్ధ శత్రువులుగా ఉన్నప్పుడు.. వారిద్దరి మధ్య స్నేహాన్ని కుదరచడానికి సిద్ధిఖి అనేక రకాల ప్రయత్నాలు చేశాడు. చివరికి అందులో విజయం సాధించాడు. స్థూలంగా చూస్తే సల్మాన్ ఖాన్ తో ఉన్న స్నేహం వల్లే సిద్ధిఖి హతమయ్యాడని.. లారెన్స్ గ్యాంగ్ కు టార్గెట్ అయ్యాడని తెలుస్తోంది. అయితే అతడిని చంపడం ద్వారా సల్మాన్ ఖాన్ కు లారెన్స్ గ్యాంగ్ హెచ్చరికలు జారీ చేసిందని జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్ ఖాన్ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్, అతడి వ్యవసాయ క్షేత్రం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేసింది. గతంలో సల్మాన్ ఖాన్ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ పై కాల్పులు జరిగినప్పుడు.. ముఖ్యమంత్రి షిండే సంఘటనా స్థలానికి వెళ్లారు. సల్మాన్ ఖాన్ ను విమర్శించారు. భద్రతపరంగా చర్యలు తీసుకుంటామని ఆయనకు హామీ ఇచ్చారు. అప్పుడు కాల్పులు జరిపిన వ్యక్తుల్ని పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. అయినప్పటికీ ఈ ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Did closeness with salman khan lead to baba siddiquis murder
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com