Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ భవితవ్యం ప్రస్తుతం నేతలపై ఆధారపడి ఉంది. ఇప్పటికే పార్టీలో సీనియర్లు పెరగడంతో పార్టీ విజయావకాశాలపై ప్రభావం పడుతోంది. దీంతో చాలా మంది ముందుకు రావడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఎంతమందికి టికెట్లు ఇస్తారో ఎవరనిని పక్కన పెడతారో అర్థం కావడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నా కేడర్ బలంగా ఉండటంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే ఉత్సాహంలో ఉంది. కానీ అధికార పక్షాన్ని ఢీకొట్టాలంటే ఇంకా రెట్టింపు జోష్ కావాల్సిందే. దీని కోసం బాబు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో టికెట్ల గోల తలనొప్పిగా మారనుంది. ఈసారి యువతకే పెద్దపీట వేయాలని భావిస్తున్నారు. దీంతో టీడీపీ భవితవ్యం ఇప్పుడు రసకందాయంలో పడనుంది. నియోజకవర్గాల్లో ఇన్నాళ్లుగా కష్టపడి పని చేస్తున్న వారికి కూడా టికెట్లు దక్కుతాయో లేదో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ ప్రక్షాళనపై కూడ చంద్రబాబు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేతలు పార్టీని నమ్ముకున్నా ప్రతిఫలం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ తో పొత్తుపై సంచలన ప్రకటన చేసిన చంద్రబాబు
రాబోయే ఎన్నికల్లో పొత్తులు ప్రధాన ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ జనసేన పార్టీలు పొత్తు పెట్టుకోవడంతో రాబోయే ఎన్నికల నాటికి టీడీపీతో కూడా పొత్తు ఉండబోతోందనే సంకేతాలు వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే చాలా సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుంది. అందుకే నేతల్లో భయం పట్టుకుంది. పార్టీ కోసం ఖర్చు చేసినా నిష్ర్పయోజనం అయ్యేనా అనే ఆలోచనలో పడిపోయారు.
దీంతో టీడీపీ నేతల్లో అంతర్మథనం ప్రారంభమైంది. కానీ వైసీపీని ఎదుర్కొనే క్రమంలో అన్ని పార్టీలు కలవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. మొత్తానికి రాబోయే ఎన్నికల్లో మరిన్ని రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయనే వాదన కూడా వినిపిస్తోంది. ఇక టీడీపీ నేతల్లో జోష్ నింపేందుకు చంద్రబాబు కూడా తగు ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల నాటికి పార్టీని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు చూస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: సొంత నియోజకవర్గంపై చంద్రన్న ఫోకస్.. నేతలకు బుజ్జగింపా..వార్నింగా?