MAA AP Elections: ‘మా ఏపీ’ ఎన్నికలకు రంగం సిద్ధం అట. ఇదేందయ్యా ఇది.. ఇది ఎప్పుడు మనం వినలేదుగా.. ఇది ఎక్కడ నుంచి వచ్చింది ? దర్శకుడు దిలీప్ రాజా ఇది పెట్టాడట. దిల్ రాజు తెలుసు.. ఇంతకీ ఈ దిలీప్ రాజా ఎవరు ? పైగా కరోనా వలన యూనియన్ నియమ నిబంధనల మేరకు సకాలంలో ఎన్నికలు నిర్వహించలేదని తెగ ఫీల్ అయిపోతున్నాడు. అన్నట్టు ప్రస్తుతం కార్యవర్గంలో అధ్యక్షులుగా ఉంది ఎవరో తెలుసా ? సీనియర్ నటి కవిత అట. ఆమె ఫోటో పోస్ట్ చేస్తే గానీ, ఆమెను నేటి తరం గుర్తు పట్టకపోవచ్చు. ఆమె అధ్యక్షులు ప్చ్.
ఇక ప్రధాన కార్యదర్శి విషయానికి వస్తే.. మన కత్తుల జూనియర్ కాంతారావు నరసింహ రాజు, పాపం ఈయనకు సినిమాలు లేకపోయినా ఒక పదవి అయితే ఇచ్చారు. ఇక కార్యదర్శి అన్నపూర్ణ గారు ఉన్నారట. అయితే వీరి పదవీ కాలం ముగిసిందని ఎలెక్షన్స్ పెడుతున్నారు. ఈ సందర్భంగా జాయింట్ సెక్రటరీగా ఉన్న సీనియర్ హాస్య నటి శ్రీలక్ష్మిని తొలిగించారు. అలాగే ఆమె ఇక పోటీ కూడా చేయడానికి వీలు లేదు అట. తెలంగాణా ‘మా’ ఎన్నికల్లో శ్రీలక్ష్మి పోటీ చేసింది.
Also Read: చంద్రబాబు బలం సరిపోవడం లేదా? అందుకే ఆపసోపాలా.
ఆ కారణంగా ఆమెను పదవి నుంచి నియమ నిబంధనల మేరకు రెండు యూనియన్‌లలో ఉండే అవకాశం లేదు కాబట్టి ఆమెను మా ఏపి నుండి తొలగించారు అని దిలీప్ రాజా చెప్పుకొచ్చాడు. అసలు ఏపీలో మెంబర్స్ ఉండేదే చాలా తక్కువ. ఇలా ఉన్నోళ్లను కూడా తొలిగించుకుంటూ పోతే ఇక మిగిలేది అధ్యక్షులు మాత్రమే. అయితే 24 విభాగాలకు చెందిన 400 మంది టెక్నీషియన్లకు, నటీనటులు ఇందులో సభ్యులుగా చేరినట్లు దిలీప్ రాజా సగర్వంగా చెబుతున్నాడు.
అసలు ఇంతకీ ‘మా ఏపి’ హైదరాబాద్‌లోని ‘మా’కు వ్యతిరేకం కాదట. అసలు వ్యతిరేకం అని ఎవరు అన్నారు. విభజన జరిగింది కాబట్టి ఏపీలో ‘మా ఏపీ’ నీ నెలకొల్పారట. ఇక ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు ‘మా ఏపి ఎన్నికలు, మా ఏపీ కార్యాలయం, ఆలపాటి నగర్, సుల్తానాబాద్, తెనాలి 522 201, ఆంధ్రప్రదేశ్’ చిరునామాకు తమ దరఖాస్తును తెల్ల కాగితంపై రాసి పంపితే.. ఎన్నికలలో పోటీ చేయడానికి పర్మిషన్ ఇస్తారట.