https://oktelugu.com/

‘సింహం’తో కలిసిన ‘లైగర్’.. ‘అన్ స్టాపబుల్’ ఎంటర్ టైన్ మెంటేనా?

Unstoppable: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ కోసం హోస్ట్ గా మారిన సంగతి అందరికీ తెల్సిందే. ‘అన్ స్టాపబుల్’ పేరుతో ‘ఆహా’ నిర్వహిస్తున్న టాక్ షోకు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ షోలో బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోని నటీనటులతోపాటు వివిధ రంగాలకు చెందిన వారిని తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాబుల్’ ఓటీటీలో నిజంగా అన్ స్టాపబుల్ రేంజులో దూసుకెళుతోంది. ఈ షోలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 7, 2022 / 11:15 AM IST
    Follow us on

    Unstoppable: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ కోసం హోస్ట్ గా మారిన సంగతి అందరికీ తెల్సిందే. ‘అన్ స్టాపబుల్’ పేరుతో ‘ఆహా’ నిర్వహిస్తున్న టాక్ షోకు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ షోలో బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోని నటీనటులతోపాటు వివిధ రంగాలకు చెందిన వారిని తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు.

    బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాబుల్’ ఓటీటీలో నిజంగా అన్ స్టాపబుల్ రేంజులో దూసుకెళుతోంది. ఈ షోలో ఇప్పటికే పలువురు స్టార్స్, ప్రముఖులు పాల్గొన్నారు. ఓటీటీ ప్రియులకు బాలయ్య ‘అన్ స్టాపబుల్’ ఎంతోగానో కనెక్ట్ కావడంతో ఈ షో మేకర్స్ ఈ షోను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

    ‘ఆన్ స్టాపబుల్’ షోలో ఇటీవల మాస్ మాస్ రవితేజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ రవితేజ సినిమా విషయాలతోపాటు వ్యక్తిగత విషయాలు, డ్రగ్స్ వంటి విషయాలపై ఆరా తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఎపిసోడ్ కు అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించింది. తాజాగా బాలకృష్ణ టాలీవుడ్ రౌడీ, అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవకొండతో ఒక ఎపిసోడ్ చేస్తున్నారు.

    నందమూరి నటసింహం ‘లైగర్’ను ఎలాంటి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాడు? వీరిద్దరి మధ్య సంభాషణ ఎలా జరిగి ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ షోకు సంబంధించిన షూటింగ్ తాజాగా పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రోమోను ‘ఆహా’ రిలీజు చేసేందుకు సన్నహాలు చేస్తోంది. అయితే ప్రోమో కంటే ముందు బాలయ్య, విజయ్ దేవకొండలు ‘అన్ స్టాపబుల్’ షోలో పాల్గొన్నప్పుడు దిగిన ఒక ఫొటో మాత్రం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.