https://oktelugu.com/

ఆత్మనిబ్బరం ఎవరికీ..? సామాన్యులకు ఉపయోగపడేనా..?

కరోనా కాలంలో ప్రజలు ఆర్థికంగా చితికి పోయారు. లాక్డౌన్ కారణంగా నెలల కొద్దీ పనుల్లేక పస్తులుండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని రంగాలు మినహా దాదాపు అన్ని రంగాలు ఆర్థికంగా కుంగిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ కరోనా ఫస్ట్ వేవ్ లో 21 లక్షల కోట్ల ఆత్మనిబ్బర ప్యాకేజీ ప్రకటించింది. తాజాగా సెకండ్ వేవ్ తగ్గుతున్న తరుణంలో 6 లక్షల కోట్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ఆత్మనిర్బరం ప్యాకేజీ పేదలకు, సామాన్యులకు […]

Written By:
  • NARESH
  • , Updated On : July 1, 2021 7:35 am
    Follow us on

    కరోనా కాలంలో ప్రజలు ఆర్థికంగా చితికి పోయారు. లాక్డౌన్ కారణంగా నెలల కొద్దీ పనుల్లేక పస్తులుండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని రంగాలు మినహా దాదాపు అన్ని రంగాలు ఆర్థికంగా కుంగిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ కరోనా ఫస్ట్ వేవ్ లో 21 లక్షల కోట్ల ఆత్మనిబ్బర ప్యాకేజీ ప్రకటించింది. తాజాగా సెకండ్ వేవ్ తగ్గుతున్న తరుణంలో 6 లక్షల కోట్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ఆత్మనిర్బరం ప్యాకేజీ పేదలకు, సామాన్యులకు ఎంతవరకు ఉపయోగపడుతాయోనన్న అనుమానాలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి.

    కరోనా ఫస్ట్ వేవ్ లో వైరస్ గురించి పూర్తిగా అవగాహన లేకపోవడంతో ప్రజలు జాగ్రత్తపడ్డారు. కానీ కేసులు తగ్గడంతో విచ్చలవిడిగా తిరిగారు. దీంతో కేసులు ఊహించని సంఖ్యలో పెరిగాయి. ఇక సెకండ్ వేవ్ లో ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా కరోనా చికిత్స చేసే అవకాశాన్ని కల్పించింది. దీంతో ప్రజలు ప్రాణాలను కాపాడుకునేందుకు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. కోట్ల రూపాయలు ఖర్చయినా కొందరి ప్రాణాలు దక్కలేదు.

    కరోనా లాక్డౌన్ వల్ల ఎక్కువగా పేదలు, సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోజూవారీ కూలీల పరిస్థితి చెప్పలేని పరిస్థితి. ఇంచుమించుగా వీరు ఆర్థికంగా కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం రేషన్ బియ్యంను పెంచడం తప్ప ఇంకే విధంగా ఆదుకోలేని విమర్శలు వస్తున్నాయి. తాజాగా ప్రకటించిన ప్యాకేజీతో ప్రైవేట్ ఆర్థిక సంస్థలు గట్టెక్కడంతో ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని అంటున్నారు. అయితే ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన జనం అనవసర కొనుగోళ్లు ఎందుకు చేస్తారని అంటున్నారు.

    ఇదిలా ఉండగా గతంలో ప్రకటించిన ఉద్దీపన పథకాలు సామాన్యులకు ఎంతవరకు ఉపయోగపడ్డాయన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. చిరు వ్యాపారులకు రూ.10వేలు ఇచ్చి ఆదుకున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. అవి పేదలకు ఉపయోగపడలేదని అంటున్నారు. ఇక ఇప్పుడు ఆర్థిక మంత్రి ప్రకటించిన ఫండ్ లో ప్రభుత్వాసుపత్రులకు నిధులు కేటాయించలేదు. ఇప్పటికే చాలా చోట్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల బాట పట్టి జేబులు గుళ్ల చేసుకున్నారు. అంటే ఇదంతా కేవలం కార్పొరేట్ కంపెనీలకు మేలు చేయడం కోసమేనని కొందరు విమర్శలు చేస్తున్నారు.