https://oktelugu.com/

వ్యాక్సినేషన్ పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

కరోనా మహమ్మారిని తట్టుకునేందుకు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అయితే ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకోవాలంటే కోవిన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉండేది. అంతేకాకుండా హై రిస్క్ ఉన్న వాళ్లకు కొన్ని ఆధారాలతో వ్యాక్సిన్లు వేస్తున్నారు. 18 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ ఎప్పుడిస్తారోనన్న ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది.అయితే ఆందోళనకు తెరదించుతూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా ప్రజల్లో ఉన్న గందగోళానికి తెర దించినట్లయింది. కరోనా వ్యాక్సినేషన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 1, 2021 / 07:54 AM IST
    Follow us on

    కరోనా మహమ్మారిని తట్టుకునేందుకు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అయితే ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకోవాలంటే కోవిన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉండేది. అంతేకాకుండా హై రిస్క్ ఉన్న వాళ్లకు కొన్ని ఆధారాలతో వ్యాక్సిన్లు వేస్తున్నారు. 18 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ ఎప్పుడిస్తారోనన్న ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది.అయితే ఆందోళనకు తెరదించుతూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా ప్రజల్లో ఉన్న గందగోళానికి తెర దించినట్లయింది.

    కరోనా వ్యాక్సినేషన్ ను మొదట 45 సంవత్సరాలకు పైబడినవారికి అందించారు. ఆ తరువాత హై రిస్క్ ఉన్న వారికి టీకా ప్రారంభించారు. అయితే 18 సంవ్సరాలకు పైబడిన వారికి టీకా అందిస్తామని కేంద్రం ఎప్పుడో ప్రకటించింది. అయితే ఆ తరువాత కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఆ తరువాత టీకాను ఉచితంగా పంపిణీ చేస్తామని కేంద్రం ప్రకటించడంతో రాష్ట్రాలు తమ ప్రజలకు నిరంతరంగా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగేలా చూస్తున్నారు.

    తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఓపెన్ వ్యాక్సిన్ ను ప్రకటించింది. 18 ఏళ్ల పైబడిన వారందరికీ టీకా వేయాలని బుధవారం నిర్ణయించడంతో నేటినుంచి ఆ ప్రక్రియ కొనసాగనుంది. అయితే వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వారు మాత్రం కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం రిజిస్ట్రేషన్ కు మినహాయింపు ఇచ్చింది. ఇక్కడి వారు నేరుగా ఆరోగ్య కేంద్రాల్లోకి వెళ్లి టీకా తీసుకోవచ్చని తెలిపింది.

    రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడిన వారు 1.5 కోట్లకు పైగానే ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 100 జీసీవీసీలను, పట్టణ ప్రాంతాల్లో 204, గ్రామీణ ప్రాంతాల్లో 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా టీకా అందించనున్నారు.అయితే ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేసుకుంటేనే కరోనాను తరిమికొట్టవచ్చని, ప్రజలందరూ సహకరించాలని ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.