
ఎన్నో రాత్రులు వచ్చాయి కానీ రాదే వెన్నెలమ్మ అంటూ అందమైన పాటలు పాడి సింగర్ సునీత.. తన సెకండ్ ఇన్నింగ్స్ లో తనివితీరా ఎంజాయ్ చేస్తోంది. మొదటి భర్తతో ఇద్దరి సంతానం కలిగి విడాకులు తీసుకొని చాలా రోజులు ఒంటరి జీవితం గడిపిన సునీత.. ఇప్పుడు ప్రముఖ మీడియా అధినేత రామ్ ను చేసుకున్నాక సేదతీరుతోంది.
తాజాగా సముద్ర తీరాన లేత గులాబీ డ్రస్సులో అందంగా సింగర్ సునీత కనిపిస్తోంది. సూరీడు వాలిపోతున్న వేళ అరుణ వర్ణపు ఆకాశంలో సముద్రపు అలల హోరుల నడుమ సునీత చూపులు చూపుతిప్పకుండా ఉన్నాయి.
సునీత తన సహజ సంప్రదాయానికి భిన్నంగా కనిపిస్తూ మోడ్రన్ లుక్కులో అలరిస్తోంది. సునీత తాజాగా షేర్ చేసిన ఈ ఫొటో వైరల్ అవుతోంది.
మ్యాంగో అధినేత రామ్ ను రెండో పెళ్లి చేసుకున్న సునీత.,. ఈ కరోనా లాక్ డౌన్ విహారయాత్రలతో భర్తతో కలిసి పర్యటిస్తోంది. ఆ కమ్రంలోనే సముద్ర తీరంలో ఇలా కనిపించి కనువిందు చేసింది.