https://oktelugu.com/

అధ్యక్షుడు కాకున్నా.. డైరెక్షన్‌ మొత్తం ఆయనదే..!

కాంగ్రెస్‌.. మునిగిపోతున్న నావాలా ఉంది దాని పరిస్థితి. అలాంటి పార్టీని బలోపేతం చేయాలని.. ప్రక్షాళన చేయాలని గట్టిగా తలిచారంట ముఖ్యనేతలు. పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి రావాలన్నా.. పటిష్టం కావాలన్నా మార్పులు అవసరమని భావిస్తోంది. అయితే.. రాహుల్‌ గాంధీ నేరుగా అధ్యక్ష పదవి చేపట్టినా.. చేపట్టకపోయినా ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికైనా ఆయన సూచనల మేరకే టీం పనిచేస్తుందట. ప్రధానంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఏఐసీసీలో ఎక్కువ మంది రాహుల్ గాంధీ అనుకున్న నేతలే సభ్యులుగా మారనున్నారు. Also Read: […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 1, 2021 / 01:05 PM IST
    Follow us on


    కాంగ్రెస్‌.. మునిగిపోతున్న నావాలా ఉంది దాని పరిస్థితి. అలాంటి పార్టీని బలోపేతం చేయాలని.. ప్రక్షాళన చేయాలని గట్టిగా తలిచారంట ముఖ్యనేతలు. పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి రావాలన్నా.. పటిష్టం కావాలన్నా మార్పులు అవసరమని భావిస్తోంది. అయితే.. రాహుల్‌ గాంధీ నేరుగా అధ్యక్ష పదవి చేపట్టినా.. చేపట్టకపోయినా ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికైనా ఆయన సూచనల మేరకే టీం పనిచేస్తుందట. ప్రధానంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఏఐసీసీలో ఎక్కువ మంది రాహుల్ గాంధీ అనుకున్న నేతలే సభ్యులుగా మారనున్నారు.

    Also Read: చరిత్రలో తొలిసారి.. నిర్మల పేపర్ లెస్ ‘స్మార్ట్’ బడ్జెట్

    ఈ మేరకు ఇదే విషయం ఇప్పటికే సీనియర్‌‌ నేతలకు తెలిసినట్లుగా సమాచారం. కాంగ్రెస్‌ను ఇప్పటివరకు సీనియర్‌‌ లీడర్లే ఏలుతున్నారు. మొన్నటి వరకూ సోనియా గాంధీ నేతృత్వం వహించడంతో ఆమెకు అండగా ఉంటూనే పార్టీని వారి డైరెక్షన్‌లోనే నడిపించారు. దీనివల్ల కొన్నిచోట్ల లబ్ధి చేకూరినా, ఎక్కువ చోట్ల నష్టపోయిందని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ నష్టపోవడానికి కారణం సీనియర్ నేతల సలహాలేనని ఒక నిర్ణయానికి వచ్చారు.

    Also Read: టీఆర్ఎస్ ప్రశ్న: బీజేపీ అయోధ్య వసూళ్ల లెక్కలేవి?

    ఇంతపెద్ద కాంగ్రెస్‌ పార్టీకి త్వరలోనే సంస్థాగత ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ఈ ఎన్నికల ద్వారానే పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఇందుకు రాహుల్ గాంధీ అంగీకరిస్తారా? లేదా? అన్నది ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. రాహుల్ గాంధీ అంగీకరించకపోతే సీనియర్ నేతకు పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశముంది. అది కూడా రాహుల్‌కు అనుకూలంగా ఉండే నేతనే అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారు. ఇటీవల పార్టీకి శాశ్వత అధ్యక్షుడు కావాలంటూ సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది సీనియర్ నేతల్లో అనేక మందిని పార్టీ పదవుల నుంచి తప్పిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    వీరికి పార్టీలో కీలకమైన ఏ పదవి అప్పగించరట. కొత్త టీంను తయారు చేసుకుంటారట. ఇందుకోసం ఇప్పటికే కొందరు యువ నేతల అభిప్రాయాలను రాహుల్ గాంధీ స్వయంగా సేకరిస్తున్నారని చెబుతున్నారు. సచిన్ పైలట్, ప్రియాంక గాంధీ వంటి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. కొత్త టీం ఎంపికకు కసరత్తు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మొత్తంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే.. రాహుల్‌ అధ్యక్ష పదవి చేపట్టకున్నా ఆయన టీంకు మాత్రమే పదవులు లభించనున్నాయి. పార్టీ పూర్తిగా ఆయన డైరెక్షన్‌లోనే నడువనుంది.