https://oktelugu.com/

బీజేపీ పట్ల టీఆర్‌‌ఎస్‌ మెతక వైఖరి..: అందుకే ఈ దాడులా..?

మనం మెతకగా ఉంటే.. ఎదుటోడు మరింత రెచ్చిపోతుండడాన్ని నిజజీవితంలో చూస్తూనే ఉంటాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌‌ఎస్‌ పరిస్థితీ అలానే ఉంది. టీఆర్‌‌ఎస్‌ మెతకవైఖరితోనే బీజేపీ రెచ్చిపోతున్నట్లుగా అర్థమవుతోంది. అందుకే ఈ విధ్వంసాలు ఎదుర్కొనాల్సి వస్తోందని తెలుస్తోంది. బీజేపీ లీడర్లు ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులకు పాల్పడుతున్నారంటే పరిస్థితి ఎలా తయారైందో అర్థం చేసుకోవచ్చు. నిన్న వరంగల్‌లో జరిగిన ఈ దుర్ఘటనే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. Also Read: కేంద్రబడ్జెట్: ఏపీకి వరం.. తెలంగాణకు శాపం అధికార పార్టీకి […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 1, 2021 / 01:04 PM IST
    Follow us on

    మనం మెతకగా ఉంటే.. ఎదుటోడు మరింత రెచ్చిపోతుండడాన్ని నిజజీవితంలో చూస్తూనే ఉంటాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌‌ఎస్‌ పరిస్థితీ అలానే ఉంది. టీఆర్‌‌ఎస్‌ మెతకవైఖరితోనే బీజేపీ రెచ్చిపోతున్నట్లుగా అర్థమవుతోంది. అందుకే ఈ విధ్వంసాలు ఎదుర్కొనాల్సి వస్తోందని తెలుస్తోంది. బీజేపీ లీడర్లు ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులకు పాల్పడుతున్నారంటే పరిస్థితి ఎలా తయారైందో అర్థం చేసుకోవచ్చు. నిన్న వరంగల్‌లో జరిగిన ఈ దుర్ఘటనే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది.

    Also Read: కేంద్రబడ్జెట్: ఏపీకి వరం.. తెలంగాణకు శాపం

    అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇంటిపై బీజేపీ కార్యకర్తలు బెరుకు లేకుండా వచ్చి దాడులు చేసేశారు. అయోధ్య రామాలయం కోసం బీజేపీ నేతలు వసూలు చేస్తున్న విరాళాలపై లెక్కలు చెప్పాలంటూ పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతకు కారణం అయ్యాయి. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హన్మకొండలోని ఆయన ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడులకు దిగారు. పెద్ద ఎత్తున ధర్మారెడ్డి ఇంటిపై రాళ్లు, కోడి గుడ్లు విసిరారు. రాళ్ల దాడిలో అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇంటి ఆవరణలో కుర్చీలను కూడా బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఓ పోలీసు అధికారికి గాయాలయ్యాయి. కాసేపటికి పెద్ద ఎత్తున పోలీసులు ధర్మారెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. దాడులు చేసిన వారందరినీ అరెస్ట్ చేశారు. యాభై మందికిపైగా దాడి ఘటనలో పాల్గొన్నారని వారిపై కేసులు నమోదు చేశామని పోలీసులు ప్రకటించారు.

    Also Read: జానాకు దీటైన అభ్యర్థుల కోసం వేట .: సాగర్‌‌పై పార్టీల ఫోకస్

    ఈ దాడి ఘటనపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వెంటనే స్పందించారు. భౌతిక దాడులు చేయాలని టీఆర్ఎస్ అనుకుంటే.. బీజేపీ నేతలు తట్టుకోలేరని హెచ్చరించారు. ధర్మారెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. వరంగల్‌కు చెందిన కీలక టీఆర్ఎస్ నేతలంతా ధర్మారెడ్డిని పలకరించడానికి వచ్చారు. బీజేపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. తాము ప్రతిదాడులు చేయాలనుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని హెచ్చరించారు. వారు బయటకు ఆ మాట చెప్పారు కానీ బీజేపీ నేతల ఇళ్లపై దాడులు చేయడానికి అంగీకారం తెలిపినట్లుగా ఉన్నారు. అందుకే రాత్రంతా వరంగల్ జిల్లాలో బీజేపీ నేతల ఇళ్లపై దాడుల పరంపర సాగింది. కొంత మది ఇళ్లను జేసీబీలతో కూల్చివేశారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    అయోధ్య విరాళాలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎలాంటి వ్యతిరేకత వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్నా.. బీజేపీ నేతలు ఓవర్‌గా స్పందిస్తున్నారు. వారు వ్యక్తం చేసిన అభిప్రాయం తప్పా.. ఒప్పా అన్నది పట్టించుకోవడంలేదు. ముందు తప్పుగా చిత్రీకరించేసి కొట్టడానికి వెళ్తున్నారు. గతంలో కోరుట్ల ఎమ్మెల్యే విషయంలోనూ అదే జరిగింది. ఇప్పుడు ధర్మారెడ్డి విషయంలోనూ సేమ్‌ రిపీట్‌. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి.. చట్ట విరుద్ధమైతే న్యాయపరమైనచర్యలు తీసుకోవాలని కోరాలి. కానీ.. చట్టాన్నిచేతుల్లోకి తీసుకుని ఇళ్లపై దాడికి పాల్పడటం సరైంది కాదు. ఇలాంటివి రాజకీయాలను దారి తప్పేలా చేస్తున్నాయి. దాడుల వరకూ వెళ్లిపోయాయి.