https://oktelugu.com/

అన్నాడీఎంకేకు ఆమే కాబోయే లీడర్‌

కొన్నాళ్లు జైలు జీవితం.. జైలు జీవితం చరమాంఖంలో కరోనా కాటు.. ఇదీ జయలలిత నిచ్చెలి శశికళ నిన్నటివరకు పరిస్థితి. కరోనాతో హాస్పిటల్‌లో చేరిన శశికళ ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉందని మొన్నటికి మొన్న డాక్టర్లు ప్రకటించారు. చివరకు పూర్తిగా కోలుకొని ఆమె ఆస్పత్రి డిశ్చార్జి అయ్యారు. ఎన్నటికైనా సీఎం కావాలనేది ఆమె కల. ఆమె ఎట్టకేలకు ఆరోగ్యం నుంచి కోలుకోవడంతో ఇప్పుడు తమిళ రాజకీయాల్లో అసలైన సినిమా ప్రారంభం కాబోతోంది. Also Read: కరోనా వ్యాక్సిన్ కోసం […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 1, 2021 / 01:10 PM IST
    Follow us on

    కొన్నాళ్లు జైలు జీవితం.. జైలు జీవితం చరమాంఖంలో కరోనా కాటు.. ఇదీ జయలలిత నిచ్చెలి శశికళ నిన్నటివరకు పరిస్థితి. కరోనాతో హాస్పిటల్‌లో చేరిన శశికళ ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉందని మొన్నటికి మొన్న డాక్టర్లు ప్రకటించారు. చివరకు పూర్తిగా కోలుకొని ఆమె ఆస్పత్రి డిశ్చార్జి అయ్యారు. ఎన్నటికైనా సీఎం కావాలనేది ఆమె కల. ఆమె ఎట్టకేలకు ఆరోగ్యం నుంచి కోలుకోవడంతో ఇప్పుడు తమిళ రాజకీయాల్లో అసలైన సినిమా ప్రారంభం కాబోతోంది.

    Also Read: కరోనా వ్యాక్సిన్ కోసం రూ.33 వేల కోట్లు

    ఆస్పత్రిలో ఉన్న సమయంలోనే ఆమె జైలు శిక్ష ముగిసింది. జైలు నుంచి విడుదలైన పత్రాలు కూడా ఓకే అయిపోయాయి. దీంతో ఆమె డిశ్చార్జ్ అయి నేరుగా ఇంటికే వెళ్లారు. అయితే.. చెన్నై కాదు.. బెంగళూరులోనే ఫిబ్రవరి ఎనిమిదో తేదీ వరకు విశ్రాంతి తీసుకుంటారు. అయితే.. ఈ డిశ్చార్జ్ తర్వాత ఆమె ఇంటికి వెళ్లడానికి ఉపయోగించిన కారుకు అన్నాడీఎంకే ఫ్లాగ్ పెట్టారు. ఆమెను అన్నాడీఎంకే నుంచి తొలగించారు. ఆమె రాజకీయ వారసుడు నటరాజన్ కొత్త పార్టీ పెట్టారు. ఆ పార్టీ తరపున ఎమ్మెల్యే అయ్యారు. అయితే తర్వాత సక్సెస్ కాలేదు. కానీ.. ఇప్పుడు శశికళ అన్నాడీఎంకేను టేకోవర్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

    Also Read: అధ్యక్షుడు కాకున్నా.. డైరెక్షన్‌ మొత్తం ఆయనదే..!

    ప్రస్తుతం తమిళనాడు అన్నాడీఎంకేలో బలమైన నేతలు ఎవరూ లేరు. శశికళ రంగంలోకి దిగితే.. టాప్ లీడర్ అవుతుంది. అన్నాడీఎంకేలో కింది స్థాయి నేతలు.. చివరికి మంత్రులు కూడా శశికళ వైపు వెళ్లిపోతారన్న ప్రచారం జరుగుతోంది. ఈ వ్యూహంతోనే అంతర్గతంగా పనులు చక్క బెట్టేశారని కూడా అంటున్నారు. అన్నాడీఎంకే క్యాడర్ కూడా.. శశికళ విషయంలో సానుకూలతగానే ఉండే అవకాశం ఉంది. ఆమెపై తీవ్ర వ్యతిరేకత చూపించే పరిస్థితులు ఇప్పుడు లేవని అంటున్నారు. అటు పళనీ స్వామి కానీ.. ఇటు పన్నీర్ సెల్వం కానీ.. అధికారంలో ఉన్న ఈ కొద్ది రోజుల్లో ప్రజల్లో తిరుగులేని ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నం కూడా చేయలేకపోయారు. ఈ కారణంగా శశికళ రాక అన్నాడీఎంకేలో కాక రేపుతోంది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    జయలలిత తరహాలోనే శశికళ తమిళనాడులో ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంది. శశికళను వ్యతిరేకిస్తున్న కొంత మంది మాత్రం తమ పార్టీని ఎక్కడ టేకోవర్ చేస్తారోనన్న ఆందోళనకు గురవుతున్నారు. అన్నాడీఎంకే పార్టీ జెండాలను ఎలా వాడుకుంటారని విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ.. వారు చాలా పరిమితం. మొత్తానికి శశికళ తమిళనాడుకు వచ్చే సరికి సీన్ సీరియస్‌గా మారిపోనుంది. దీనిబట్టి అన్నాడీఎంకేకు వచ్చే ఎన్నికల్లో ఆమే లీడర్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.