ఎన్నికలకు సై: జగన్ ఓడాడు.. నిమ్మగడ్డనే గెలిచాడు..

‘చట్టానికి.. న్యాయానికి జరిగిన ఈ సమరంలో.. కన్నీళ్లకు కరిగిపోని తీర్పు’ అంటూ అదేదో సినిమాలో పాటలా సాగింది ఏపీలో నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ సీఎం జగన్ ఫైట్. ఈ ఫైట్ లో చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో నిమ్మగడ్డ గెలిచాడు.. ఏపీ సీఎం జగన్ ఓడిపోయాడు. ఏపీలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఏపీలోని జగన్ సర్కార్ వెనకడుగు వేసింది. కోర్టు తీర్పునకు అనుగుణంగా అడుగులు వేస్తున్నట్టు ప్రకటించింది. సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఏపీ సీఎం […]

Written By: NARESH, Updated On : January 25, 2021 7:48 pm
Follow us on

‘చట్టానికి.. న్యాయానికి జరిగిన ఈ సమరంలో.. కన్నీళ్లకు కరిగిపోని తీర్పు’ అంటూ అదేదో సినిమాలో పాటలా సాగింది ఏపీలో నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ సీఎం జగన్ ఫైట్. ఈ ఫైట్ లో చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో నిమ్మగడ్డ గెలిచాడు.. ఏపీ సీఎం జగన్ ఓడిపోయాడు.

ఏపీలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఏపీలోని జగన్ సర్కార్ వెనకడుగు వేసింది. కోర్టు తీర్పునకు అనుగుణంగా అడుగులు వేస్తున్నట్టు ప్రకటించింది.

సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఏపీ సీఎం జగన్ పార్టీ ముఖ్య నేతలు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై చర్చించారు. ప్రభుత్వం తరుఫు నుంచి పంచాయితీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై సమీక్షించారు.

ఈ క్రమంలోనే జగన్ సర్కార్ పై కయ్యానికి కాలుదువ్వుతున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు ఏపీ ప్రభుత్వం సహకరించాలని నిర్ణయించింది.

ఈ సమీక్ష తరువాత ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని తెలిపారు. ఎవరిపైనా పైచేయి సాధించాలని ఎన్నికల వాయిదాను కోరలేదని.. వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేంద్రం సలహా తీసుకుంటామని.. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం చివరి వరకు పోరాడిందని తెలిపారు. ఎన్నికలు జరిపి తీరాలన్న ఎస్ఈసీ పట్టుదల వెనుక కుయుక్తులు ఉన్నాయని ఆరోపించారు. ఎన్నికలకు వైసీపీ ఎప్పుడూ సిద్ధమేనని తెలిపారు. మాకు ఎలాంటి ఇగో సమస్యలు లేవని.. ఎస్ఈసీ నిర్ణయం ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ప్రజల కోసం చేసిన పోరాటంలో పరాజయం కూడా ఆనందమే అని సజ్జల వెనుకేసుకొచ్చారు.