పవన్ కళ్యాణ్ ను త్యాగపురుషుడిని చేస్తున్న సోము వీర్రాజు?

ఇప్పటికే తెలంగాణలో నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ఒకసారి బెండ్ అయిపోయాడు. జనసేన అభ్యర్థులను పోటీచేయించి మరీ బీజేపీ కోరిక మేరకు విత్ డ్రా చేయించాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చి అస్త్రసన్యాసం చేశాడు. ఇప్పుడు ఏపీలోని తిరుపతి ఉప ఎన్నిక కోసం రెడీ అవుతూ ఆ సీటు కోసం కేంద్రంలోని పెద్దలపై ఒత్తిడి పెంచుతున్నాడు. అయితే బీజేపీ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ తిరుపతి సీటును జనసేనకు వదులుకునేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఈ […]

Written By: NARESH, Updated On : January 25, 2021 7:06 pm
Follow us on

ఇప్పటికే తెలంగాణలో నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ఒకసారి బెండ్ అయిపోయాడు. జనసేన అభ్యర్థులను పోటీచేయించి మరీ బీజేపీ కోరిక మేరకు విత్ డ్రా చేయించాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చి అస్త్రసన్యాసం చేశాడు.

ఇప్పుడు ఏపీలోని తిరుపతి ఉప ఎన్నిక కోసం రెడీ అవుతూ ఆ సీటు కోసం కేంద్రంలోని పెద్దలపై ఒత్తిడి పెంచుతున్నాడు. అయితే బీజేపీ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ తిరుపతి సీటును జనసేనకు వదులుకునేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే మరోసారి బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేనాని ఇంటికొచ్చి మరీ దువ్వే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.

గ్రేటర్ ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ ఏకంగా పోటీకి దిగి మరీ బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిల విజ్ఞప్తితో వెనకడుగు వేశారు. ఇప్పుడు కూడా జనసేనను డ్రాప్ చేసే బాధ్యతను సోము వీర్రాజు, పురంధేశ్వరి సహా బీజేపీ నేతలు భుజాన వేసుకున్నట్టు తెలుస్తోంది.

ఏపీలో 2024లో బీజేపీ-జనసేన సంయుక్తంగా అధికారంలోకి రావాలంటే ఇప్పుడు తిరుపతి సీటును జనసేన వదులుకోవాల్సిందేనన్నట్టుగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఒత్తిడిని పవన్ పై తెస్తున్నట్టు సమాచారం.

బీజేపీ ఇప్పటికే ఏపీలో ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ సీటును కూడా గెలచుకోలేదు. ఈ క్రమంలోనే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీపై పోరాడాలంటే గెలుపు కంపల్సరీ అని.. అందుకే తిరుపతి లాంటి ఆధ్యాత్మిక సీటును బీజేపీకి ఇస్తే గెలిచి 2024కు మరింతగా దూకుడుగా వెళ్లేందుకు బీజేపీకి చాన్స్ ఉంటుందని బీజేపీ భావిస్తోంది. తెలంగాణలో లాగే ఏపీలోనూ బీజేపీకి ఊపు తీసుకురావాలంటే తిరుపతి సీటును వదులుకోవాల్సిందేనని పవన్ పై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే పవన్ సైతం తిరుపతి ఎంపీ సీటును వదులుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

జాతీయ పార్టీకి బీజేపీకి వదిలేస్తే తన పార్టీ పరపతి మరింత పెరుగుతుందని.. కేంద్రం వద్ద మైలేజీ వస్తుందని.. ఒక్క సీటు గెలిచినంత మాత్రాన జనసేనకు వచ్చే లాభం లేదని పవన్ యోచిస్తున్నట్టు సమాచారం. అయితే జీహెచ్ఎంసీలో వదులుకొని తిరుపతిలో వదులుకుంటే జనసైనికులకు పవన్ ఏం మెసేజ్, భరోసా ఇస్తాడని.. ఆ పార్టీ చీలిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన జనసేనలోకనిపిస్తోంది.

Tags