https://oktelugu.com/

గబ్బాలో సిరాజ్, శార్ధూల్ వేసిన స్కెచ్ ఫలించింది.. ఏం చేశారంటే?

ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో అద్వితీయంగా గెలిచి ఆస్ట్రేలియాను ఓడించిన భారత్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో అసలు గబ్బా టెస్టులో ఏం జరిగిందనేది ఒక్కో విషయం బయటపడుతోంది. తాజాగా గెలుపు వ్యూహాన్ని భారత ఇద్దరు బౌలర్లు రచించారనే విషయం తెలిసింది. బ్రిస్బేన్ టెస్టులో వికెట్ కు రెండు వైపులా ఒత్తిడి పెంచాలన్నది తమ ప్రణాళిక అని టీమిండియా పేసర్ సిరాజ్ పేర్కొన్నాడు. ఆటకు ముందు తాను, శార్ధుల్ ఠాకూర్ ఈ విషయంపై చర్చించుకున్నామని తెలిపాడు. […]

Written By:
  • NARESH
  • , Updated On : January 25, 2021 / 08:35 PM IST
    Follow us on

    ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో అద్వితీయంగా గెలిచి ఆస్ట్రేలియాను ఓడించిన భారత్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో అసలు గబ్బా టెస్టులో ఏం జరిగిందనేది ఒక్కో విషయం బయటపడుతోంది.

    తాజాగా గెలుపు వ్యూహాన్ని భారత ఇద్దరు బౌలర్లు రచించారనే విషయం తెలిసింది. బ్రిస్బేన్ టెస్టులో వికెట్ కు రెండు వైపులా ఒత్తిడి పెంచాలన్నది తమ ప్రణాళిక అని టీమిండియా పేసర్ సిరాజ్ పేర్కొన్నాడు. ఆటకు ముందు తాను, శార్ధుల్ ఠాకూర్ ఈ విషయంపై చర్చించుకున్నామని తెలిపాడు. చక్కని ప్రాంతాల్లో బంతులు వేయడంతో అసీస్ ఆటగాళ్లు త్వరగా ఔటయ్యారని తెలిపారు.

    ఆస్ట్రేలియా పర్యటనలో అరంగేట్రం చేసిన సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 13 వికెట్లు తీసి ఆశ్చర్యపరిచాడు. చివరిదైన మూడో టెస్టులో ఏకంగా 5 వికెట్లు తీసి ఆస్ట్రేలియా పతనానికి నాంది పలికాడు. బౌలింగ్ దాడికే నాయకత్వం వహించాడు.

    ఒత్తిడి వ్యూహంతోనే ఆస్ట్రేలియాపై వికెట్లు సాధించామని.. కొంత సమయం కూర్చొని మరీ స్కోరు చేయలేని ప్రాంతాల్లో బంతువు వేశామని సిరాజ్ తెలిపారు. కోచింగ్, సహాయ సిబ్బంది అండతోనే మేమిలా చేయగలిగామని తెలిపారు. వికెట్ కు రెండు వైపులా కట్టుదిట్టమైన బంతులతో ఒత్తిడి పెంచితే బ్యాట్స్ మెన్ ఖచ్చితంగా తప్పులుచేస్తారని.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు వికెట్లు ఇచ్చారని తెలిపారు.