కాంగ్రెస్ నాశనానికి కారకులు వారేనా?

ఒకప్పుడు దేశ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగింది కాంగ్రెస్‌ పార్టీ. దశాబ్దాల పార్టీకి.. అంతకన్నా గొప్ప చరిత్రే ఉంది. దేశానికి స్వాత్రంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆ పార్టీకి తిరుగులేదు. అలాంటి కాంగ్రెస్‌ పార్టీలో చెప్పుకునేందుకు మహామహులు సైతం ఉన్నారు. కానీ.. గత ఆరేడేళ్లుగా ఆ పార్టీ గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటోంది. జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. దీనికి స్వయంకృతాపరాధమే కారణంగా చెబుతున్నారు అనాలసిస్టులు. తమ చేతకానితనంతో నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం […]

Written By: Srinivas, Updated On : March 6, 2021 11:21 am
Follow us on


ఒకప్పుడు దేశ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగింది కాంగ్రెస్‌ పార్టీ. దశాబ్దాల పార్టీకి.. అంతకన్నా గొప్ప చరిత్రే ఉంది. దేశానికి స్వాత్రంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆ పార్టీకి తిరుగులేదు. అలాంటి కాంగ్రెస్‌ పార్టీలో చెప్పుకునేందుకు మహామహులు సైతం ఉన్నారు. కానీ.. గత ఆరేడేళ్లుగా ఆ పార్టీ గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటోంది. జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. దీనికి స్వయంకృతాపరాధమే కారణంగా చెబుతున్నారు అనాలసిస్టులు. తమ చేతకానితనంతో నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. వరుసగా లోక్ సభ ఎన్నికల్లో రెండుసార్లు ఘోర ఓటమి చవిచూడటానికి కూడా కాంగ్రెస్ ఈ దుస్థితికి రావడానికి కారణంగా చెప్పుకోవాలి.

Also Read: బెంగాల్‌లో మమతా బెనర్జీ బీజేపీని ఢీకొట్టే ప్లాన్ ఇదే..

అంతేకాదు.. కాంగ్రెస్‌కు ఎవరు బయట శత్రువులు లేరు. పార్టీలోని వారే ఆ పార్టీకి శత్రువులవుతున్నారు. నాలుగేళ్ల క్రితం గోవాలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను ‘చే’జిక్కించుకుంది. అయినా చేతకానితనంతో ఆ రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించింది. సరైన సమయంలో స్పందించలేదన్న కారణంగా సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను ఇన్‌చార్జి పదవి నుంచి తప్పించడం మినహా కాంగ్రెస్ తీసుకున్న చర్యలేవీ లేవు. కనీసం ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం కూడా చేయలేకపోయింది.

Also Read: ‘రక్షణ’ బడ్జెట్ పెంచుతున్న చైనా.. అమెరికాకు సరితూగుతుందా?

సరైన నాయకత్వం లేకపోవడం, కేంద్ర నాయకత్వం దిశానిర్దేశం చేయకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తింది. తర్వాత కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. బీజేపీకి ఎక్కువ స్థానాలను వచ్చిన జేడీఎస్‌తో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మంచి వ్యూహాన్నే రచించింది. బీజేపీని అధికారంలోకి రాకుండా సమర్థంగా ఎదుర్కోగలిగింది. అయితే.. ఆ ఆనందం పద్నాలుగు నెలలకే ఆవిరైంది. కాంగ్రెస్‌లో అనైక్యత, అసంతృప్తి కారణంగానే ప్రభుత్వం కుప్పకూలిందని చెప్పక తప్పదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతోనే బీజేపీకి అధికారంలోకి రాగలిగింది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

మధ్యప్రదేశ్‌లో మూడు దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న బీజేపీకి చెక్ పెట్టి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. కానీ కాంగ్రెస్ నేతల కలహాల కారణంగానే జ్యోతిరాదిత్యసింధియా తన వర్గంతో బీజేపీలో చేరిపోవడంతో అక్కడా కుదురుగా ఉన్న ప్రభుత్వం కుప్పకూలిపోయింది. తాజాగా.. పుదుచ్చేరిలోనూ అదే జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కారణంగానే ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఇక కాంగ్రెస్ సొంతంగా పంజాబ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో మాత్రమే అధికారంలో ఉంది. మహారాష్ట్రలో అధికార కూటమిలో ఉంది. మొత్తంగా చూస్తే.. కాంగ్రెస్‌కు తన పార్టీలోని దిగ్గజాలతోనే పార్టీకి ఈ దుస్థితి వచ్చిందనే సుస్పష్టం.