అద్భుతం: అంగారకుడిపై అమెరికా రోవర్ ప్రయాణం

భూమి మీద ఎవరైనా నడుస్తారు.. అదే గాలి,నీరు, వాతావరమే లేని అంగారక గ్రహంపై నడవాలంటే దమ్ముకావాలి. ఇప్పటికే ఓసారి భారతదేశం పంపిన రోవర్ అక్కడి అంగారక గ్రహంపై కుప్పకూలి మన శ్రమ బూడిదలో పోసిన పన్నీరైన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల అమెరికా పంపిన ‘పర్సెవరెన్స్’ మాత్రం అంగారకుడిపైకి విజయవంతంగా దిగి ఫొటోలు, వీడియోలు తీస్తోంది. వాటిని భూమికి పంపితే అవి చూసి మన శాస్త్రవేత్తలు, ప్రజలు అబ్బురపడుతున్నారు. మొత్తం అరుణవర్ణంగా ఉన్న అంగారకుడిని చూసి ఆశ్చర్యపోతున్నారు. […]

Written By: NARESH, Updated On : March 6, 2021 11:03 am
Follow us on

భూమి మీద ఎవరైనా నడుస్తారు.. అదే గాలి,నీరు, వాతావరమే లేని అంగారక గ్రహంపై నడవాలంటే దమ్ముకావాలి. ఇప్పటికే ఓసారి భారతదేశం పంపిన రోవర్ అక్కడి అంగారక గ్రహంపై కుప్పకూలి మన శ్రమ బూడిదలో పోసిన పన్నీరైన సంగతి తెలిసిందే.

అయితే ఇటీవల అమెరికా పంపిన ‘పర్సెవరెన్స్’ మాత్రం అంగారకుడిపైకి విజయవంతంగా దిగి ఫొటోలు, వీడియోలు తీస్తోంది. వాటిని భూమికి పంపితే అవి చూసి మన శాస్త్రవేత్తలు, ప్రజలు అబ్బురపడుతున్నారు. మొత్తం అరుణవర్ణంగా ఉన్న అంగారకుడిని చూసి ఆశ్చర్యపోతున్నారు.

తాజాగా అమెరికా పంపిన రోవర్ ‘పర్సెవరెన్స్’ మరో గొప్ప ముందడుగు వేసింది. అంగారక గ్రహంపై తొలి విజయవంతంగా ముందుకు సాగింది. ఈ టెస్ట్ డ్రైవ్ విజయవంతమైనట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రకటించింది.

ఆరు చక్రాలు గల పర్సెవరెన్స్ 33 నిమిషాల టైంలో 6.5 మీటర్ల దూరం ప్రయాణించిందని నాసా తెలిపింది. ఇందుకు సంబంధించి రోవర్ పంపిన చిత్రాల్లో అది తిరిగి ప్రదేశాల్లో రోవర్ అడుగు జాడలు కనిపించడం విశేషం.

ఈ కీలక ముందడుగుతో మరింతగా అంగారకుడి ఉపరితలంపై తిరగడానికి అవాకాశం కలిగిందని.. దీనిపై పరిశోధించి అంగారకుడిపై టెస్ట్ డ్రైవ్ లు నిర్వహిస్తామని నాసా తెలిపింది. ఇదో అద్భుతయాత్ర అని పేర్కొంది. ఈ మేరకు పలు ఫొటోలు, వీడియోలను నాసా పంచుకుంది.