ఈ వారంలో ఎన్నో విషయాలు వైరల్ అయ్యాయి. మాజీ ప్రియుడు హృతిక్ పై కంగనా సెటైర్లు వేసింది. అమలాపాల్ విడాకులపై నోరు విప్పింది. జాన్ అబ్రహం బట్టలు విప్పేయగా.. హీరోయిన్ శ్రియ భయపడిపోయింది వంటి అంశాలు.. ఈ వీక్ లో ట్రెండీగా నిలిచాయి. ఆ వివరాలేంటో చూసేద్దామా..
మాజీ ప్రియుడిపై కంగనా సెటైర్..
నకిలీ మెయిల్ ఐడీతో వందలాది మెయిల్స్ పంపుతున్నారని, తనను బెదిరిస్తున్నారని, దీని వెనక కంగనా రనౌత్ ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు హృతిక్ రోషన్. ఇదంతా 2016లో జరిగింది. కాగా.. కంగనాపై ఫిర్యాదు చేసిన విషయమై హృతిక్ ముంబై పోలీసుల ఎదుట తాజాగా హాజరయ్యాడు. ఈ నేపథ్యంలో కంగనా మరోసారి వివాదాస్పదంగా వ్యాఖ్యానించింది. ప్రపంచమంతా మారిపోయి ముందుకు వెళ్తోంది. కానీ.. నా మాజీ ప్రియుడు సిల్లీగా అక్కడే ఆగిపోయాడు. కాలం కూడా వెనక్కి పోలేదు. కానీ.. హృతిక్ వెనక్కి వెళ్లి వివాదాన్ని తిరగదోడుతున్నాడు అని ట్వీట్ చేసింది. దీంతో.. ఈ మాజీ లవర్స్ విషయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
తొలిసారి విడాకులపై స్పందించిన అమలాపాల్..
తమిళ్ బ్యూటీ అమలాపాల్ భర్తతో విడిపోయిన విషయం తెలిసిందే. 2014లో దర్శకుడు విజయ్ కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ.. కొంత కాలానికే అభిప్రాయ బేధాలతో ఇద్దరూ విడిపోయారు. 2017లో వారు విడాకులు తీసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తొలిసారి తన విడాకులపై మాట్లాడింది. భర్తతో విడిపోయిన సమయంలో తనకు మద్దతు లభించలేదని, అందరూ భయపెట్టారని అన్నారు. కానీ.. తన మానసిక పరిస్థితిని, ఆందోళన ఎవరూ పట్టించుకోలేదని చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లోనే తాను భర్తతో విడిపోయినట్టు చెప్పింది అమలాపాల్. అంతేకదు.. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నాటకాలు ఆడుతుంటారని, ఆ ఫేక్ షోను గుర్తుపట్టాలని సూచించారు అమలా.
Also Read: రాజమౌళి మెచ్చిన టీజర్.. చూస్తే షేకింగ్
తలుపు వేయకుండానే.. అందుకే అరుస్తాః నిహారిక
ఇక, మెగా డాటర్ నిహారిక కూడా మరోసారి వార్తల్లో నిలిచింది. వివాహం తర్వాత సైలెంట్ అయిన నిహారిక-చైతన్య జంట.. ఈ వీక్ లో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తానూ, వరుణ్ తేజ్ క్లాస్ మెట్స్ అని చెప్పాడు చైతూ. అంతేకాదు.. తన తండ్రికి, చిరంజీవికి ఫ్రెండ్షిప్ ఉందని, ఆ విధంగానే.. ఈ పెళ్లి సంబంధం సెట్ అయ్యిందని చెప్పాడు. నిహారిక మాట్లాడుతూ.. తాను పుట్టింట్లో మాదిరిగానే అత్తారింట్లోనూ కంఫర్ట్ గా ఉన్నట్టు చెప్పింది. అంతేకాదు.. తానే చైతన్యపై అరుస్తున్నట్టు చెప్పింది. రూమ్ లో కంఫ్ట్ గా కూర్చున్నప్పుడు చైతన్య వచ్చి.. తలుపు వేయకుండా అటూ ఇటూ తిరుగుతుంటాడని చెప్పింది. దీనివల్ల తాను డిస్టర్బ్ అవుతానని, తలుపు వేయకపోవడంపై అరుస్తానని చెప్పుకొచ్చింది. మొత్తానికి పుట్టింటిని మించిన గారాబం అత్తారింట్లో పొందుతున్నానని చెప్పింది మెగా డాటర్.
గాలిలో తాప్సీ.. కిస్సింగ్ స్టంట్!
అత్యంత కమిట్ మెంట్ చూపించే భారతీయ నటీమణుల్లో తాప్సీ ముందు వరసలో ఉంటుంది. క్యారెక్టర్ నచ్చితే ఎలాంటి యాక్షన్ చేయడానికైనా సిద్ధంగా ఉంటుందీ నటీమణి. ప్రస్తుతం ఆమె ‘లూప్ లపేట’ చిత్రంలో నటిస్తున్నా. ఇందులో గ్లామర్ డోస్ హై రేంజ్ లోనే ఉంది. ఈ చిత్రంలోని ఓ సీన్ లో భాగంగా గాలిలో రోప్ సాయంతో ముద్దు సీన్ లో నటించాల్సి వచ్చింది. ఆ సీన్ కూడా ముఖంలో చిరునవ్వు చెదరకుండా చేసేసిందట ఈ బ్యూటీ. పది అడుగుల ఎత్తులో షూట్ చేసిన ఈ సీన్ ఓ యాక్షన్ సన్నివేశం లాంటిదని అన్నాడు దర్శకుడు. అది చూసిన తర్వాత.. ఆ సీన్ ను ‘కిస్సింగ్ స్టంట్’ గా అభివర్ణించాడు దర్శకుడు.
Also Read: ట్రైలర్ టాక్: భర్త చనిపోయిన మహిళతో ‘చావు’ ప్రేమ
తెరపై హీరోతో రొమాన్స్ చేసింది.. స్టేజ్ పై బ్రదర్ అనేసింది!
సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘ఏ1 ఎక్స్ ప్రెస్’. ఈ శుక్రవారం రిలీజైన సినిమా.. పాజిటివ్ టాక్ తోనే దూసుకెళ్తోంది. అయితే.. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పొరపాటున హీరోను అన్న అనేసింది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. స్టేజ్ పై మాట్లాడుతూ.. అనుకోకుండా తడబడింది. ఈ సినిమా చాలా బాగా వచ్చిందని, చాలా కష్టపడి పూర్తిచేశామని చెప్పిన లావణ్య.. ‘హీరో సందీప్ అన్న గురించి చెప్పాలంటే..’ అని మొదలు పెట్టింది. దీంతో.. అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. ఈ విషయాన్ని వెంటనే గుర్తించిన లావణ్య.. పొరపాటును సరిదిద్దేందుకు ప్రయత్నించింది. హీరోను అన్న అనేయడం సరికాదని, అతను నాకు కాదు.. మీకు అన్న అంటూ కవర్ చేసింది. కానీ.. ఆమె కవర్ డ్రైవ్ చేసిందన్న విషయం అక్కడున్నవారందరికీ అర్థమైంది. మొత్తానికి యథాలాపంగా అనేసిన మాట వైరల్ అయ్యింది.
భర్త పక్కనున్నా.. శ్రీయ గుండెలు గుభేల్ మన్నాయట!
సౌత్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన శ్రీయ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా వీరిద్దరూ కలిసి ఇటలీ లోని పెరుకు వెళ్లారు. అక్కడ కుజ్కో ప్రాంతంలోని ‘మాచు పిచ్చు’ జూకు వెళ్లారు. అక్కడ జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారను శ్రీయ. అక్కడ ఉన్న జంతువులను చూస్తుండగా.. సౌతాఫ్రికా జాతికి చెందిన ఓ గొర్రె శ్రీయా ముందు నుంచి ఉన్నట్టుండి పరుగులు పెట్టిందట. దీంతో తాను చాలా భయపడిపోయానంటూ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిందీ హీరోయిన్. దీంతో.. వైరల్ అయ్యింది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
బట్టలు విప్పేసిన జాన్ అబ్రహం..
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం కండల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. తన సిక్స్ ప్యాక్ బాడీతో అమ్మాయిల మనసు దోచేస్తుంటాడు జాన్. అయితే.. లేటెస్ట్ గా బట్టలు మొత్తం విప్పేసి కనిపించాడీ హీరో. శిరో భాగంతోపాటు బాడీ మొత్తాన్ని గాలికి వదిలేసన జాన్.. అధో భాగాన్ని మాత్రం దిండుతో కవర్ చేశాడు. సోఫాలో ఫ్రీగా కూర్చొని ఫొటోకు స్మైల్ ఇచ్చాడు. ఈ ఫొటో తెగ వైరల్ అయ్యింది. అయితే.. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాడు. తన బట్టలు లాండ్రీ నుంచి రావడం లేటైందట. అందుకే ఇలా ఫోజు ఇచ్చాడట.