కొవిషీల్డ్ డోసుల వ్యవధి పెంపుపై దుమారం?

దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంటున్న తరుణంలో కొవిషీల్డ్ డోసుల వ్యవధి పెంపుపై వివాదం చోటుచేసుకుంది. రెండు డోసుల మధ్య విరామాన్ని పెంచడం ద్వారా కరోనా వైరస్ మరింత బలపడే అవకాశముందని శాస్త్రవేత్తలు వద్దంటున్నా కేంద్రం మొండి పట్టుదలతో ఈ నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. సైంటిఫిక్ ఎవిడెన్స్ తో కూడిన డేటాను విశ్లేషించిన తరువాతే కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధి పెంచామని, ఇది పూర్తిగా పారదర్శకంగా తీసుకున్న నిర్ణయమని మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కొవిషీల్డ్ […]

Written By: Srinivas, Updated On : June 16, 2021 7:40 pm
Follow us on

దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంటున్న తరుణంలో కొవిషీల్డ్ డోసుల వ్యవధి పెంపుపై వివాదం చోటుచేసుకుంది. రెండు డోసుల మధ్య విరామాన్ని పెంచడం ద్వారా కరోనా వైరస్ మరింత బలపడే అవకాశముందని శాస్త్రవేత్తలు వద్దంటున్నా కేంద్రం మొండి పట్టుదలతో ఈ నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. సైంటిఫిక్ ఎవిడెన్స్ తో కూడిన డేటాను విశ్లేషించిన తరువాతే కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధి పెంచామని, ఇది పూర్తిగా పారదర్శకంగా తీసుకున్న నిర్ణయమని మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కొవిషీల్డ్ డోసుల వ్యవధి పెంపునకు సంబంధించి సైంటిఫిక్ ఆధారాలు విశ్లేషించడానికి భారత్ కు చాలా పటిష్టమైన వ్యవస్థ ఉంది.

కొవిషీల్డ్ డోసుల వ్యవధిని 8-12 వారాలకు మాత్రమే పెంచాలని తాము సిఫారసు చేశామని, కానీ 12-16 వారాలకు పెంచుతూ ప్రభుత్వమే నిర్ణయం తీసుకుందని నేషనల్ టెక్నాలజీ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఆన్ ఇమ్యూనైజేషన్ సభ్యులు కొందరు చెప్పినట్లు మీడియాలో వార్తలు రావడంతో ఈ వివాదం మొదలైంది. వ్యాక్సిన్ల కొరత కారణంగా కొవిషీల్డ్ డోసుల వ్యవధి పెంచినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి.

టీకా డోసుల మధ్య వ్యవధి పెంపు నిర్ణయాన్ని ఎన్టీఏజీఏ చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా కూడా సమర్థించారు. డోసుల మధ్య వ్యవధి పెంపు అనేది పూర్తిగా సైంటిఫిక్ ఆధారంగా తీసుకున్న నిర్ణయమేనని, ఎన్టీఏజీఐ సభ్యుల మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని ఈ విషయంలో మీడియా కథనాలు అవాస్తవాలని చెప్పారు.

కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో డోసుల మధ్య వ్యవధి పెంపు, తగ్గింపు అనేది ఎప్పుడైనా మారొచ్చని, భవిష్యత్తులో వ్యవధి తగ్గించే అవకాశం లేదని డాక్టర్ అరోరా వ్యాఖ్యానించారు. రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గిస్తే మంచి ఫలితాలు వస్తాయని రేపు సైంటిఫిక్ గా నిరూపణ అయితే వాటిని పరిశీలిస్తామని తెలిపారు.