హుజురాబాద్ లో రాజుకున్న రాజకీయ వేడి?

హుజురాబాద్ లో రాజకీయాలు మొదలయ్యాయి. టీఆర్ఎస్, ఈటల వర్గం మధ్య ఢీ అంటే ఢీ అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇల్లందకుంటలో నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చెక్కుల పంపిణీ జరుగుతున్న సమయంలో ఈటల మద్దతుదారులు అక్కడకు చేరుకుని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జెడ్పీ చైర్ పర్సన్ విజయ, స్థానిక ఆర్డీవోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి జెడ్పీ చైర్ పర్సన్ ఎలా అధ్యక్షత వహిస్తారని ప్రశ్నించారు. ఇరు […]

Written By: Srinivas, Updated On : June 16, 2021 7:37 pm
Follow us on

హుజురాబాద్ లో రాజకీయాలు మొదలయ్యాయి. టీఆర్ఎస్, ఈటల వర్గం మధ్య ఢీ అంటే ఢీ అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇల్లందకుంటలో నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చెక్కుల పంపిణీ జరుగుతున్న సమయంలో ఈటల మద్దతుదారులు అక్కడకు చేరుకుని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జెడ్పీ చైర్ పర్సన్ విజయ, స్థానిక ఆర్డీవోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్యక్రమానికి జెడ్పీ చైర్ పర్సన్ ఎలా అధ్యక్షత వహిస్తారని ప్రశ్నించారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో లబ్ధిదారులు నివ్వెరపోయారు. రాజకీయాలు పక్కన పెట్టి చెక్కులు పంపిణీ చేయాలని కోరారు. దీంతో 189 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో పార్టీలో చేరారు.

ఈటల చేరికతో హుజురాబాద్ ఉప ఎన్నికపై పూర్తి దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలతో కలిసి ఉప ఎన్నికకు సంబంధించిన వ్యూహాలు రచించనున్నారు. కొద్దిరోజుల్లో ఈటల సహా బీజేపీ టీం హుజురాబాద్ లో మకాం వేసే అవకాశం ఉంది. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను ఓడిస్తే రాజకీయంగా ఈటల ప్రతిష్ట పెరుగుతుంది. ఓడిపోతే మాత్రం బీజేపీకి నష్టం జరుగుతుంది. దీంతో హుజురాబాద్ లో ఎలాగైనా గెలిచి తీరాలని ఇరు వర్గాలు ఆశిస్తున్నాయి.

హుజురాబాద్ ఉప ఎన్నిక రాష్ర్ట రాజకీయాల్లోనే హైటెన్షన్ క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హుజురాబాద్ లో గులాబీ జెండా ఎగిరితే కేసీఆర్ నాయకత్వానికి తెలంగాణలో తిరుగులేదన్న సంకేతాలు వెళ్తాయి. ఒకవేళ ఓడితే మాత్రం టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకోవడానికి బీజేపీకి అవకాశం కలుగుతుంది.