దేశ రాజధాని ఢిల్లీలో మరణ మృదంగం వినిపిస్తోంది. శీతాకాలం ప్రవేశించడంతో ఢిల్లీ వణుకుతోంది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ కూడా విజృంభిస్తోంది. దీంతో ఢిల్లీలో జనాలు వైరస్ కారణంగా పిట్టల్లా రాలుతున్నారు. సెకండ్ వేవ్ మొదలైనట్టే కనిపిస్తోందని అంటున్నారు. 15 రోజుల్లోనే దేశ రాజధానిలో 872 మరణాలు సంభవించాయి. ఇది దేశంలోనే కలకలం రేపుతోంది.
Also Read: టీమిండియా జెర్సీ మారిందోచ్.. ఏ రంగునో తెలుసా?
ఢిల్లీలో ఇప్పుడు వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. గడిచిన 15 రోజుల్లోనే దేశ రాజధాని నగరంలో 870కి పైగా మరణాలు నమోదు కావడం కలవరపెడుతోంది.
కాగా అకస్మాత్తుగా కరోనా కేసులు పెరగడానికి గాలిలో నాణ్యత క్షీణించడం.. ప్రజలు భద్రతా ప్రమాణాలు పాటించడంలో ప్రజల నిర్లక్ష్యమే ఈ ఉపద్రవానికి కారణంగా చెబుతున్నారు.
Also Read: బ్యాంకు ఉద్యోగులు బలిపశువా? ఏసీబీ కేసులో ట్విస్ట్?
ఢిల్లీలో అక్టోబర్ లో 28 నుంచి రోజువారీగా 5వేల చొప్పున కొత్త కేసులు నమోదైనప్పటికీ నిన్న ఒక్కరోజే 8వేల కేసులు పెరిగాయి. ఇంత భారీ సంఖ్యలో కేసులు పెరగడానికి చలితీవ్రతే కారణంగా చెబుతున్నారు. గత రెండు రోజులుగా 80కి పైగా మరణాలు సంభవించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. బుధవారం ఒక్కరోజే 85మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 7228కి పెరిగింది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
పండుగ సీజన్ కావడం.. దీపావళి వేడకలకు జనాలు రోడ్లపైకి రావడం.. పనులు చేసుకోవడంతో వైరస్ విస్తరిస్తోంది. పెరిగిన కాలుష్యం.. జనాలు భద్రా నిబంధనలు పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యంగా ఉండడమే రెండు వారాలుగా ఢిల్లీలో కేసులు పెరగడానికి కారణంగా తెలుస్తోంది.