పది పాసైన విద్యార్థినులకు శుభవార్త.. స్కాలర్ షిప్ వివరాలివే..?

సెంటర్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పదో తరగతి పాసైన విద్యార్థినులకు శుభవార్త చెప్పింది. సింగిల్ గర్ల్ చైల్డ్ కు 6,000 రూపాయల చొప్పున సీబీఎస్ఈ స్కాలర్ షిప్ అందిస్తోంది. సీబీఎస్ఈ స్కూల్ అనుబంధ పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థినులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్ షిప్ ల పేరుతో సీబీఎస్ఈ ఈ స్కాలర్ షిప్ లను అందజేస్తోంది. అర్హత ఉన్న విద్యార్థినులు https://cbse.nic.in/ వెబ్ […]

Written By: Kusuma Aggunna, Updated On : November 12, 2020 9:03 pm
Follow us on


సెంటర్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పదో తరగతి పాసైన విద్యార్థినులకు శుభవార్త చెప్పింది. సింగిల్ గర్ల్ చైల్డ్ కు 6,000 రూపాయల చొప్పున సీబీఎస్ఈ స్కాలర్ షిప్ అందిస్తోంది. సీబీఎస్ఈ స్కూల్ అనుబంధ పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థినులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్ షిప్ ల పేరుతో సీబీఎస్ఈ ఈ స్కాలర్ షిప్ లను అందజేస్తోంది.

అర్హత ఉన్న విద్యార్థినులు https://cbse.nic.in/ వెబ్ సైట్ లో ఈ స్కాలర్ షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా వచ్చే నెల పదో తేదీలోగా విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్ షిప్ ను పొందుతున్న వాళ్లు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్ చేసుకునే విద్యార్థినులు డిసెంబర్ 28, 2020 నాటికి హార్డ్ కాపీని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

హార్డ్ కాపీని సబ్మిట్ చేయడంతో ఫెయిల్ అయితే స్కాలర్ షిప్ ను పొందడం సాధ్యం కాదు. అయితే స్కాలర్ షిప్ కు అర్హత పొందాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే విద్యార్థినికి అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లు ఉండకూడదు. ఏకైక సంతానం అయితే మాత్రమే స్కాలర్ షిప్ పొందడానికి అర్హులు. 60 శాతం మార్కులతో పదో తరగతి పాసైన విద్యార్థినులు ఈ స్కాలర్ షిప్ లకు దరఖాస్తు చేసుకోవచ్చు.

11, 12 తరగతులను సీబీఎస్ఈ బోర్డు అనుబంధ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థినులు మాత్రమే ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు. పదో తరగతిలో నెలకు ట్యూషన్ ఫీజు 1,500 రూపాయల కంటే తక్కువ మొత్తం చెల్లించిన వాళ్లు మాత్రమే ఈ స్కాలర్ షిప్ ను పొందవచ్చు.