Modi: కాశీలో మరణం కూడా మంచిదే.. ప్రధాని నోట సంచలన వ్యాఖ్యలు

Modi:  హైందవ ధర్మానికి ప్రతీక కాశీ. భక్తిభావానికి పేరెన్నిక గల నగరంగా ప్రసిద్ధి. కాశీ పవిత్రతపై అందరికి తెలిసిదే. నాగరికత వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించే ప్రాంతంగా కాశీ వినుతికెక్కింది. కాశీలో మరణం కూడా పవిత్రమే. హిందువులు తమ జన్మలో ఒక్కసారైనా కాశీ సందర్శించాలని భావిస్తుంటారు. ఎన్ని యుద్ధాలు వచ్చినా కాశీ మాత్రం చెక్కు చెదరకుండా ఉండటం చూస్తున్నాం. విదేశీయులు ఎంత తీవ్ర ప్రయత్నాలు చేసినా కాశీని మాత్రం ఏం చేయలేకపోవడం గమనార్హం. ఉత్తరప్రదేశ్ లోని గంగానది […]

Written By: Neelambaram, Updated On : December 13, 2021 8:17 pm
Follow us on

Modi:  హైందవ ధర్మానికి ప్రతీక కాశీ. భక్తిభావానికి పేరెన్నిక గల నగరంగా ప్రసిద్ధి. కాశీ పవిత్రతపై అందరికి తెలిసిదే. నాగరికత వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించే ప్రాంతంగా కాశీ వినుతికెక్కింది. కాశీలో మరణం కూడా పవిత్రమే. హిందువులు తమ జన్మలో ఒక్కసారైనా కాశీ సందర్శించాలని భావిస్తుంటారు. ఎన్ని యుద్ధాలు వచ్చినా కాశీ మాత్రం చెక్కు చెదరకుండా ఉండటం చూస్తున్నాం. విదేశీయులు ఎంత తీవ్ర ప్రయత్నాలు చేసినా కాశీని మాత్రం ఏం చేయలేకపోవడం గమనార్హం.

PM Modi

ఉత్తరప్రదేశ్ లోని గంగానది పవిత్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాల్సిందే. వారణాసిలో ప్రసిద్ధి గాంచిన ఆలయాలకు కొదవేలేదు. కాశీలో అడుగు పెడితే బంధాల నుంచి విముక్తి లభిస్తుందని తెలుస్తోంది. అందుకే కాశీ చరిత్రలో ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. భారత ప్రాచీనత కాశీలోనే కనిపిస్తుంది. సంప్రదాయానికి నిదర్శనంగా నగరం నిలుస్తోంది.

వారణాసిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాశీ విశ్వనాథ్ నడవాను ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కాశీ పవిత్రతపై వివరించారు. కాశీలో ఆధ్యాత్మికత ఎంతో ముచ్చట గొలుపుతోందని అన్నారు. ఎన్నో ఏళ్ల కల తీరిందని తన మనసులోని మాట బయటపెట్టారు. కాశీలో ప్రతి వారిలో భక్తిభావం ఎంతో ఉందని చెప్పారు.

కాశీ విశ్వేశ్వరుడే అందరికి రక్షకుడు. ఆ దేవుడి దయతోనే అందరు శాంతియుతంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి జీవిలోనూ ఈశ్వరుడే ఉన్నాడన్నారు. కాశీ నాగరికత చూస్తే మనకు ఎంతో భక్తి భావం కలుగుతుంది. ఇక్కడి దేవాలయాలు అందుకు సజీవంగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ పై ప్రశంసల జల్లు కురిపించారు. ప్ర్యతేక పూజలు చేశారు. కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకుని తన భక్తిని చాటుకున్నారు.

Also Read: Varanasi: మోడీ రాకతో కాషాయమయంగా మారిన ‘వారణాశి’..!

చరిత్రకు నిదర్శనంగా నిలిచే కాశీ పట్టణం ఆధ్యాత్మిక ప్రాంతంగా ఖ్యాతి సాధించింది. ఔరంగజేబు లాంటి వారి దండయాత్రల నుంచి కూడా సురక్షితంగా రక్షించుకుంది. అందుకే ఇక్కడ భక్తిని చూస్తుంటే ముచ్చటేస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కాశీని దర్శించుకునేందుకు ఎంతో ఇష్టపడుతుంటారు.

Also Read: Justice Chandru: జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై స్పందించిన హైకోర్టు న్యాయమూర్తులు

Tags