Atm Cash Withdrawal: 2022 సంవత్సరం రావడానికి మరో 18 రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే కొత్త సంవత్సరం రోజు నుంచి ప్రజలకు షాక్ తగలనుంది. ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా చేసేవాళ్లు ఇకపై అదనపు ఛార్జీలను చెల్లించాలి. దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ రంగ బ్యాంకులు వచ్చే సంవత్సరం నుంచి ఛార్జీలను 5 శాతం పెంచనున్నాయని తెలుస్తోంది. పరిమితిని దాటి ఏటీఎం లావాదేవీలు చేసేవాళ్లు ప్రతి లావాదేవీకి 21 రూపాయలతో పాటు జీఎస్టీని చెల్లించాలి.
ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి మూడుసార్లు విత్ డ్రా చేయవచ్చు. ఈ లావాదేవీల తర్వాత కూడా అదనపు లావాదేవీలు చెల్లించాలంటే ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఏటీఎం లావాదేవీలను గుర్తుంచుకోవడం ద్వారా ఛార్జీల భారం నుంచి తప్పించుకోవచ్చు. బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్, చెక్ బుక్, కొత్త ఏటీఎం కార్డుల జారీ కోసం కూడా ఛార్జీలు విధిస్తాయనే సంగతి తెలిసిందే.
ఖాతాలలో మినిమం బ్యాలెన్స్ లేకపొతే 1,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు చెల్లించాలి. మీ బ్యాంక్ అకౌంట్ శాలరీ అకౌంట్ లేదా జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే మినిమం బ్యాలెన్స్ గురించి ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ ద్వారా వేల కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.