AP CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మారుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ టీడీపీ మధ్య విమర్శల దాడి పెరుగుతోంది. రెండు పార్టీల్లో దూరం పెరుగుతోంది. అధికారమే ఎజెండాగా రెండు పార్టీలు తేల్చుకోవాలని భావిస్తున్నాయి. రాబోయే ఎన్నికలనే టార్గెట్ చేసుకుంటున్నాయి. ఈ నేఫథ్యంలో వైసీపీ నేతలు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నాయి. జగన్ ను చంపడానికే కుట్రలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించడం సంచలనం సృష్టిస్తోంది.
ఏపీలో సంక్షేమ పథకాలనే నమ్ముకుని జగన్ పాలన చేస్తున్నారు. దీంతో టీడీపీ నేతలు కూడా అధికారం కోసం ఎదురు చూస్తున్నారు. రెండు పార్టీల్లో అధికారం సాధించాలనే తపన కనబడుతోంది. అందుకే ఒకరిపై మరొకరు విమర్శలకు దిగుతున్నారు. ఈ మధ్య చంద్రబాబు గాల్లో వచ్చిన వారు గాల్లోనే పోతారని వ్యాఖ్యానించడంతో జగన్ ను చంపడానికే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు చేస్తుండటం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంానే వారి వ్యాపారాలు సాగనివ్వడం లేదు. దీంతో రాబోయే ఎన్నికల్లో టీడీపీ నేతలకు నిధుల కొరత ఏర్పడనుంది. ఇదే అదనుగా తమ పబ్బం గడుపుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది. అందుకే టీడీపీ నేతల్లో ఆగ్రహం పెరుగుతోందని చెబుతున్నారు.
Also Read: CM KCR: బీజేపీనే టార్గెట్ చేస్తున్న కేసీఆర్.. బీజేపీయేతర పక్షాలతో భేటీ
దీంతో రెండు పార్టీల వైరం తీవ్ర స్థాయికి చేరుతోంది. జగన్ జాగ్రత్తగా ఉండాలని వైసీపీ నేతలు సూచించడం తెలిసిందే. కానీ ఏపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ, టీడీపీ వర్గాల్లో విభేదాలు తీవ్ర స్థాయికి చేరుతున్నట్లు మాత్రం అర్థమవుతోంది. భవిష్యత్ లో ఇంకా ఎంత స్థాయిలో విభేదాలు పెరుగుతాయో వేచి చూడాల్సిందే.
Also Read: Justice Chandru: జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై స్పందించిన హైకోర్టు న్యాయమూర్తులు