https://oktelugu.com/

డేంజర్: పార్లమెంట్ కు కరోనా భయం.!

దేశ అత్యున్నత సభ సమరానికి రంగం సిద్ధమైంది. సోమవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 14 నుంచి సమావేశాలు మొదలై.. అక్టోబర్ 1కి ఈ సమావేశాలు ముగుస్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎంపీలకు కరోనా పరీక్షలు మొదలయ్యాయి. శని, ఆదివారాల్లో ఎంపీలందరికీ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఈ టెస్టుల్లోనూ కొంతమంది ఎంపీలకు పాజిటివ్ అని తేలినట్లు సమాచారం. Also Read: చెలిమి అంటూనే చైనా దొంగదెబ్బ తీస్తోందా? పార్లమెంట్ సమావేశాలకు 72 గంటల ముందు హాజరయ్య […]

Written By:
  • NARESH
  • , Updated On : September 13, 2020 / 05:02 PM IST
    Follow us on

    దేశ అత్యున్నత సభ సమరానికి రంగం సిద్ధమైంది. సోమవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 14 నుంచి సమావేశాలు మొదలై.. అక్టోబర్ 1కి ఈ సమావేశాలు ముగుస్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎంపీలకు కరోనా పరీక్షలు మొదలయ్యాయి. శని, ఆదివారాల్లో ఎంపీలందరికీ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఈ టెస్టుల్లోనూ కొంతమంది ఎంపీలకు పాజిటివ్ అని తేలినట్లు సమాచారం.

    Also Read: చెలిమి అంటూనే చైనా దొంగదెబ్బ తీస్తోందా?

    పార్లమెంట్ సమావేశాలకు 72 గంటల ముందు హాజరయ్య ఎంపీలందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. నెగెటివ్ గా తేలితే.. వారికి సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఆ పత్రం ఉన్న వారినే సభలోకి అనుమతిస్తామని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రం పార్లమెంట్ సమావేశాల్లో కరోనా నియంత్రణ చర్యలను చేపడుతున్నారు.. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, ప్రముఖులు వైరస్ బారినపడ్డారు.

    ఇప్పటివరకు 24 మంది ఎంపీలకు.. 8మంది కేంద్రమంత్రులకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో సమావేశాలకు హాజరయ్యే ఎంపీల్లో కలవరం మొదలైంది. సమావేశాల మధ్యలో ఎవరికైనా వైరస్ సోకితే మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

    Also Read: అమిత్ షా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందా?

    ఇక కేంద్ర ప్రభుత్వ అధికారులు, మీడియా ప్రతినిధులు, సెక్రెటేరియట్ సిబ్బంది కూడా పరీక్షలు చేయించుకోవాలని స్పీకర్ కోరారు.