
దేశంలో కారోన కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కర్ఫ్యూను అమలు పరుస్తున్నాయి. అనేక చోట్ల బయటకు వచ్చిన వారిపై పోలీసులు దాడులు చేస్తున్నారు. ఈ దాడులకు చెక్ పెట్టేవిధంగా కేరళ పోలీసులు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. అవసరమైన వస్తువులను కొనడానికి బయటకు రావాలనుకునే వారికి కేరళ పోలీసులు పాస్లు జారీ చేస్తారు. ఎటువంటి కారణం లేకుండా సాధారణంగా బయలుదేరిన వారిపై కేసు నమోదుచేస్తున్నారు.
తిరువనంతపురం జిల్లాలో నేడు 52 కేసులు నమోదయ్యాయి. ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని కేరళ పోలీసు చీఫ్ లోక్‌నాథ్ బెహ్రా తెలిపారు.
ఇదే విధంగా తెలుగు రాష్ట్రాలలో కూడా అత్యవసరంగా, నిత్యావసర వస్తువుల కొరకు బయటకు వచ్చే వారికి పాస్ లు మంజూరు చేస్తే మంచిదని పలువురు వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.