https://oktelugu.com/

వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీ..: మారణాయుధాలతో ట్రంప్‌ మద్దతుదారుల ఆందోళన

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎంతో హోరాహోరీగా జరిగాయి. ఉత్కంఠ పోరులో చివరకు బైడెన్‌ ప్రెసిడెంట్‌గా గెలుపొందారు. అయితే.. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం తన ఓటమిని ఇంకా అంగీకరించడం లేదు. అంతేకాదు.. తన సీటును విడిచి వెళ్లేది లేదంటూ మారాం చేస్తున్నారు. ఏకంగా తానే గెలిచినట్లు ప్రకటించాలంటూ కుటిల రాజకీయాలు సైతం చేస్తున్నారు. ట్రంప్‌ చేసేది పనికిమాలిన రచ్చ అంటే.. ఆయన మద్దతుదారులు మరింత రెచ్చిపోతున్నారు. Also Read: ఈ బినామీల వల్లే అసలు సమస్యలు […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 7, 2021 1:03 pm
    Follow us on

    Trump supporters
    అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎంతో హోరాహోరీగా జరిగాయి. ఉత్కంఠ పోరులో చివరకు బైడెన్‌ ప్రెసిడెంట్‌గా గెలుపొందారు. అయితే.. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం తన ఓటమిని ఇంకా అంగీకరించడం లేదు. అంతేకాదు.. తన సీటును విడిచి వెళ్లేది లేదంటూ మారాం చేస్తున్నారు. ఏకంగా తానే గెలిచినట్లు ప్రకటించాలంటూ కుటిల రాజకీయాలు సైతం చేస్తున్నారు. ట్రంప్‌ చేసేది పనికిమాలిన రచ్చ అంటే.. ఆయన మద్దతుదారులు మరింత రెచ్చిపోతున్నారు.

    Also Read: ఈ బినామీల వల్లే అసలు సమస్యలు

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల నిరసనలు, ఆందోళనలతో అట్టుడికిస్తున్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో అనూహ్య పరిణామాలు నెలకొన్నాయి. ఆ దేశ పార్లమెంట్ కేపిటల్ బిల్డింగ్‌ను ముట్టడించారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఏకంగా ఎమర్జెన్సీని ప్రకటించాల్సి వచ్చింది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ నిర్ణయాన్ని ప్రకటించింది స్థానిక ప్రభుత్వం. ఆందోళనకారులు పెద్దఎత్తున విధ్వంసానికి పాల్పడే అవకాశాలు ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వాషింగ్టన్ మేయర్ మురీల్ బోసర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చాయి. 15 రోజులపాటు ఈ ఎమర్జెన్సీ అమల్లో ఉంటుంది.

    దీనికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ మేయర్ ఓ ప్రకటన రిలీజ్‌ చేశారు. ఆందోళనకారులు విధ్వంసాలకు పాల్పడటానికి ముందే ప్లాన్ చేసుకున్నారని, దీనికి అనుగుణంగా వారు తమ వెంట మారణాయుధాలను తీసుకొచ్చారని పేర్కొన్నారు. పార్లమెంట్ భవనాన్ని ముట్టడించిన ఆందోళనకారుల చేతుల్లో కెమికల్స్, తుపాకులు, ఇటుక పెళ్లలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారని మురీల్ పేర్కొన్నారు. సాయుధులుగా వారు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారని చెప్పారు. వాషింగ్టన్ సిటీ నుంచి మరిన్ని ప్రాంతాలకు అల్లర్లను విస్తరించేలా పథకం పన్నినట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందినట్లు స్పష్టం చేశారు. అందుకే వారిని అడ్డుకోవడానికి, ఎలాంటి దాడులు, ప్రతిదాడుల ఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి ముందు జాగ్రత్త చర్యగా ఎమర్జెన్సీని విధించినట్లు వివరించారు.

    Also Read: రామతీర్థంలో టెన్షన్..పోలీసుల దాష్టీకం.. సొమ్మసిల్లిన సోము వీర్రాజు

    ఆందోళనకారులు సెనెట్‌లోకి దూసుకెళ్లడం కూడా వారి కుట్రలో భగంగా గుర్తించినట్లు పోలీసుల నుంచి మేయర్ కార్యాలయానికి సమాచారం వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియో క్లిప్పింగులను అందించారని, వాటిని పరిశీలించిన తరువాతే.. మేయర్ ఎమర్జెన్సీని విధించినట్లు తెలుస్తోంది. 15 రోజులపాటు వాషింగ్టన్‌లో అత్యవసర పరిస్థితులను కొనసాగించాల్సి రావడం వల్ల అధికార మార్పడి సజావుగా సాగుతుందని మేయర్ కార్యాలయం భావిస్తోందని అంటున్నారు. అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ ఎన్నికైనట్లు ఆ దేశ పార్లమెంట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో.. డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు ఇలా ముట్టడికి దిగినట్లుగా తెలుస్తోంది.

    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు