స్థానిక సంస్థల కోసం వైసీపీ భారీ స్కెచ్‌

ఏపీలో స్థానిక సంస్థల పదవీ కాలం ఎప్పుడో చంద్రబాబు హయాంలోనే ముగిసిపోయింది. కానీ.. అప్పుడు ఎన్నికలకు వెళ్లలేని చంద్రబాబు ప్రత్యేక అధికారుల పాలన పెట్టారు. అయితే.. జగన్‌ అధికారంలోకి వచ్చాక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధపడినా.. కరోనా అడ్డుపడింది. అప్పటి నుంచి అటు ఎలక్షన్‌ కమిషనర్‌‌, ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తూనే ఉంది. ఎన్నికలు నిర్వహించాలని కమిషనర్‌‌ నిమ్మగడ్డ రమేశ్‌.. కరోనా పరిస్థితుల కారణంగా ఇప్పుడు ఎన్నికలకు తాము సిద్ధంగా లేమంటూ ప్రభుత్వం.. కొంత కాలంగా ఈ వివాదం […]

Written By: Srinivas, Updated On : January 7, 2021 1:11 pm
Follow us on


ఏపీలో స్థానిక సంస్థల పదవీ కాలం ఎప్పుడో చంద్రబాబు హయాంలోనే ముగిసిపోయింది. కానీ.. అప్పుడు ఎన్నికలకు వెళ్లలేని చంద్రబాబు ప్రత్యేక అధికారుల పాలన పెట్టారు. అయితే.. జగన్‌ అధికారంలోకి వచ్చాక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధపడినా.. కరోనా అడ్డుపడింది. అప్పటి నుంచి అటు ఎలక్షన్‌ కమిషనర్‌‌, ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తూనే ఉంది. ఎన్నికలు నిర్వహించాలని కమిషనర్‌‌ నిమ్మగడ్డ రమేశ్‌.. కరోనా పరిస్థితుల కారణంగా ఇప్పుడు ఎన్నికలకు తాము సిద్ధంగా లేమంటూ ప్రభుత్వం.. కొంత కాలంగా ఈ వివాదం చూస్తూనే ఉన్నాం.

Also Read: ఈ బినామీల వల్లే అసలు సమస్యలు

ఇప్పటివరకు వాయిదా పడుతూ వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నిర్వహించే విషయంలో సీఎం జగన్‌ భారీ స్కెచ్‌ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో స్ధానిక ఎన్నికల నిర్వహణకు కరోనా సెకండ్‌ వేవ్‌, బ్రిటన్‌ వైరస్‌ వ్యాప్తి, వ్యాక్సిన్‌ పంపిణీ పేరుతో సవాలక్ష కారణాలు వెతికినా హైకోర్టు ఆదేశాల ప్రకారం అవేవీ ఫలించలేదు. అయితే మార్చిలో నిమ్మగడ్డ రిటైర్మెంట్‌తర్వాత ఏప్రిల్‌, మే నెలల్లో స్థానిక పోరు పెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇదే విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా వెల్లడించారు. అయితే నిమ్మగడ్డ స్థానంలో ప్రభుత్వానికి విశ్వసనీయమైన అధికారిని ఎన్నికల కమిషనర్‌గా నియమించబోతున్నట్లు సమాచారం.

గతేడాది మార్చి నెలలో కరోనా కారణంగా వాయిదా పడిన స్థానిక పోరును సరిగ్గా ఏడాది పూర్తయ్యాక నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి ఎన్నికలు వాయిదా పడి ఏడాది గడుస్తుంది. అదే సమయంలో ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ పదవీకాలం ఈ ఏడాది మార్చితో పూర్తవుతుంది. దీంతో ఆయన ఇలా వెళ్లిపోగానే అలా కొత్త కమిషనర్‌ను నియమించి ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇదే విషయాన్ని తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ శ్రేణులకు వెల్లడించారు. తిరుపతి ఉప ఎన్నిక పూర్తి కాగానే స్థానిక పోరుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సీఎం జగన్ దీనికి పక్కా స్కెచ్ రెడీ చేసి పెట్టినట్లే కనిపిస్తోంది.

Also Read: రామతీర్థంలో టెన్షన్..పోలీసుల దాష్టీకం.. సొమ్మసిల్లిన సోము వీర్రాజు

ఏపీలో ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ పదవీకాలం ఈ ఏడాది మార్చి నెలతో పూర్తవుతుంది. ఆయన పదవీ విరమణ చేయగానే ప్రభుత్వానికి తమకు నచ్చిన వారిని ఈసీగా నియమించుకునే అధికారం ఉంది. దీంతో నిమ్మగడ్డ స్థానంలో మరో విశ్వసనీయమైన అధికారిని నియమించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా సీఎస్‌గా పదవీ విరమణ చేసిన నీలం సాహ్నేను ఎన్నికల కమిషనర్‌గా నియమించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నిమ్మగడ్డ పదవీకాలం ముగియకపోవడం, ఆమె పదవీకాలం ముగియడంతో తాత్కాలిక ఏర్పాటుగా ఆమెకు సీఎం ముఖ్య సలహాదారుగా నియమించారు. నిమ్మగడ్డ రిటైర్‌ కాగానే ఈసీ బాధ్యతలు ఆమెకు అప్పగించనున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్