Crypto currency ప్రపంచం మొత్తం క్రిప్టో కరెన్సీ వైపు పరుగులు తీస్తోంది. చాలా దేశాలు దీనిని అధికారికంగా అమలు చేస్తున్నాయి. భారతదేశం ఈ దారిలో కాకుండా డిజిటల్ రూపీ పేరుతో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. వర్చువల్ గా ఉండే ఈ కరెన్సీ సామాన్యులకు అసలు అర్థం కాదు. ఈ క్రమంలో ఇందులో పెట్టుబడులు పెట్టే వారు కూడా తమ నల్లధనాన్ని తెల్లగా మార్చేందుకు ఉపయోగిస్తారనే అపవాదు కూడా ఉంది. ఈ క్రిప్టో కరెన్సీ కి నానాటికీ ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో వెస్ట్రన్ కంట్రీస్ లో అంకుర సంస్థలు పుట్టుకొచ్చాయి. అయితే మొదట్లో కొంత బాగున్నప్పటికీ.. తర్వాత పరిస్థితి మారింది. ఈ క్రిప్టో కరెన్సీ ఆధారంగా పుట్టుకొచ్చిన ఓ అంకుర సంస్థ ఇప్పుడు దివాలా అంచున నిలిచింది. ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం ముందు నిలిచిన నేపథ్యంలో.. ఈ సంస్థ కార్పొరేటర్ ప్రపంచానికి అసలు సిసలైన పాఠం చెబుతోంది.

-బైనాన్స్ కంపెనీ ఎందుకు పడి పోయిందంటే?
బైనాన్స్ కంపెనీ.. చాలామందికి ఈ సంస్థ గురించి తెలియదు. కానీ క్రిప్టో కరెన్సీ ఆధారంగా లావాదేవీలు నిర్వహించే వారికి ఈ కంపెనీ గురించి బాగా తెలుసు. క్రిప్టో కరెన్సీ కి మార్కెట్లో విలువ బాగున్నప్పుడు ఈ కంపెనీ ఆకాశాన్ని అంటే లాభాల్లో పయనించింది. అయితే ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయినట్టు.. క్రిప్టో కరెన్సీ ధరలు కూడా క్షీణించడం మొదలుపెట్టాయి. బ్యాంక్ మాన్ ఫ్రైడ్ వైట్ లైట్ గా ఉద్భవించిన నేపథ్యంలో క్రిప్టో కరెన్సీ ధరలు క్షీణించాయి.. యూరో జోన్లో ఏర్పడ్డ పరిస్థితులు కూడా ఇందుకు ఒక కారణం.. దీనివల్ల క్రిప్టో రుణ దాతలు, డిజిటల్ అసెట్ బ్రోకర్లు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.
-దివాళా తీసింది
బైనాన్స్ అనే సంస్థను జావో అనే వ్యక్తి క్రిప్టో కరెన్సీ ఆధారంగా లావాదేవీలు నిర్వహించేందుకు నెలకొల్పాడు. లిక్విడిటీ క్రంచ్ కవర్ చేయడంలో వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్నాడు. దీంతో ఆ సంస్థ అంతకంతకు విస్తరించింది. అయితే ఇటీవల బ్యాంక్ మ్యాన్ ఫ్రైడ్ పరిశ్రమ కు సంబంధించి వైట్ నైట్ గా ఉద్భవించిన నేపథ్యంలో క్రిప్టో కరెన్సీ వేల్యూ ఘోరంగా పడిపోయింది. దీనివల్ల చాలామంది నష్టపోయారు. ఈ క్రమంలో వారిని ఆదుకోవాల్సిన బాధ్యత బైనాన్స్ కంపెనీ మీద పడింది. గత్యంతరం లేక కంపెనీ ఆస్తులను ఎఫ్ టీ ఎక్స్ అనే సంస్థకు బద లాయించడం ప్రారంభమైంది. ఇక జావో తన ఎక్స్చేంజ్ త్వరలో ఎఫ్ టి హెచ్ స్థానిక టోకెన్లలో వందల మిలియన్ డాలర్లను డంప్ చేస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ టేక్ ఓవర్ అమెరికాయేతర వ్యాపారాలపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. ఇక నుంచి క్రిప్టో దిగ్గజాలైన బైనాన్స్. యూ ఎస్, ఎఫ్ టీ ఎక్స్. యూ ఎస్ ఇక నుంచి యూఎస్ అప్ సూట్ నుంచి స్వతంత్రంగా ఉంటాయి..