Kodali Nani Pawan Kalyan : రాజకీయంగా వేరు వేరు పార్టీలే అయ్యినప్పటికీ..పవన్ కళ్యాణ్ ని ఒక సినిమా హీరో గా అభిమానించే వారు అన్ని పార్టీలలో బలంగా ఉంటారు.. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ కూడా ఆయనకీ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ టాలీవుడ్ లో ఏ హీరోకి కూడా లేదనడం లో ఎలాంటి సందేహం లేదు..హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ రికార్డ్స్ బద్దలు కొట్టే స్టామినా ఉన్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే.

అందుకే ఆయన తో సినిమాలు చేయడానికి.. ఆయన సినిమాలు కొనడానికి అందరూ అలా ఎగబడుతూ ఉంటారు..ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకి 65 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు..ఇదంతా పక్కన పెడితే మాజీ మంత్రి.. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా గతం లో పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఒక సినిమాకి ఎగ్జిబిటర్ గా పనిచేసాడనే అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కెరీర్ లో జల్సా ఎంత పెద్ద హిట్టో మనకి తెలిసిందే..ఖుషి తర్వాత సరైన సక్సెస్ లేని పవన్ కళ్యాణ్ కి ‘జల్సా’ రూపం లో భారీ బ్లాక్ బస్టర్ తగిలింది..అప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఈ సినిమా ఆల్ టైం టాప్ 2 గా నిలిచింది.. ఇక కృష్ణ జిల్లాలో అయితే ఈ సినిమా అప్పట్లో ప్రభంజనం సృష్టించిందనే చెప్పాలి.. ఆ ప్రాంతం లో అత్యధిక టికెట్స్ అమ్ముడుపోయిన సినిమాగా ఈ చిత్రం సరికొత్త రికార్డు సృష్టించింది.
అలాంటి సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమాను కృష్ణ జిల్లాలో రైట్స్ కొనుగోలు చేసి విడుదల చేసిన కొడాలి నానికి మంచి లాభాలే వచ్చాయి..కేవలం ఈ సినిమాకి మాత్రమే కాదు..చాలా సినిమాలకు ఆయన కృష్ణ జిల్లాలో డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు..ఇక తన ప్రాణ స్నేహితుడు జూనియర్ ఎన్టీఆర్ ని హీరో గా పెట్టి అదుర్స్, సాంబ వంటి సినిమాలు నిర్మించాడు..సాంబ యావరేజి గా ఆడగా..అదుర్స్ సూపర్ హిట్ గా నిలిచింది.