జాతీయ వార్తలుGujarat : మొసలిని టీవీలో చూస్తేనే భయపడతాం.. అలాంటిది ఏకంగా ఇంటి మీదకే ఎక్కింది.. వీడియో...

Gujarat : మొసలిని టీవీలో చూస్తేనే భయపడతాం.. అలాంటిది ఏకంగా ఇంటి మీదకే ఎక్కింది.. వీడియో వైరల్

Gujarat :  గుజరాత్ రాష్ట్రంలో ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వరుణుడు బీభత్సం సృష్టించడంతో ఆ రాష్ట్రం మొత్తం వణికి పోతోంది. ముఖ్యంగా సౌరాష్ట్ర ప్రాంతంలో వర్షాలు అపారమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి. వరద నీరు పోటెత్తడం వల్ల సౌరాష్ట్ర ప్రాంతంలోని ప్రధాన నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. జలాశయాలలో నీటిమట్టాలు ప్రమాదకరస్థాయిని మించి ఉన్నాయి. వరద నీరు వల్ల చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు ద్వీపకల్పాన్ని తలపిస్తున్నాయి. రైలు మార్గాలలో నీరు చేరుకోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో పలు రైళ్లను అధికారులు ఎక్కడికక్కడే రద్దు చేశారు. విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల గుజరాత్ రాష్ట్రంలో మొత్తం 28 మంది మృతి చెందారు. 18,000 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వచ్చే కొద్ది రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దాదాపు 11 జిల్లాలకు రెడ్, 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఇంటిపై కప్పుకు ఎక్కింది

గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒక వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. వర్షాల వల్ల వరద నీటి ప్రవాహానికి కొట్టుకు వచ్చిన మొసలి ఓ ఇంటి పై కప్పుకు ఎక్కింది. అక్కడ అది సేద తీరుతూ కనిపించింది.. గురువారం వడోదర ప్రాంతంలోని అకోటా మైదానంలో విస్తారంగా వర్షం కురిసింది. ఆ వరద నీటిలో సరీ సృపాలు కొట్టుకు వచ్చాయి. అందులో భాగంగానే ఈ ముసలి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.. మరోవైపు గుజరాత్ లో వరద సృష్టించిన విలయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో ఫోన్లో మాట్లాడారు. వరద పరిస్థితిపై అంచనా వేశారు. సహాయక చర్యలపై ఆరా తీశారు..కాగా, ఆ మొసలి ఇంటి పైకప్పు పై సేద తీరుతున్న దృశ్యాలను కొంతమంది తమ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం లక్షల కొద్ది వీక్షణలను సొంతం చేసుకుంది.

మొసలిని రక్షించండి..

మొసలి ఇంటి పైకప్పునకు ఎక్కిన నేపథ్యంలో.. దాన్ని రక్షించాలని కొంతమంది సోషల్ మీడియాలో అటవీ శాఖ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే కొందరేమో అంతటి వరదలో వారు మాత్రం ఎలా వెళ్తారని, మొసలి ని ఎలా రక్షిస్తారని ప్రశ్నిస్తున్నారు. “మొసలి జింక కాదు, సామాన్య ప్రాణి అంతకన్నా కాదు. అది తన ప్రాణాన్ని తాను రక్షించుకోగలదు. దానిని కాపాడేందుకు వెళ్తే అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేస్తుందేమో.. ఒకసారి ఆలోచించండి” అంటూ కొంతమంది నెటిజన్లు పేర్కొన్నారు.. అయితే ఆ మొసలి ఆ వరద ప్రవాహంలోనే దిగువ ప్రాంతానికి వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Gujarat: కొడుకు కోసం చిరుతతో పోరాడాడు.. ఈ తండ్రి ధైర్యానికి హాట్సాఫ్

Gujarat: పులి అనే పేరు వినిపిస్తేనే మనకు వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది పులి అతడి ఎదురుగా వచ్చింది. చూస్తుండగానే అతడి కొడుకు మీద దాడి చేసింది. ఆ సమయంలో అతడి స్థానంలో...

Gujarat: ఖమ్మం యువకుడు.. చైనాలో ఎంబీబీఎస్.. వైట్ కాలర్ సయ్యద్ “ఉగ్ర ముఖం” ఎన్ని రూపులు మారిందంటే..

Gujarat: అతడి పేరు సయ్యద్..వయసు 30 సంవత్సరాలు.. ఖమ్మంలో పుట్టాడు. ఆ తర్వాత ఎంబిబిఎస్ చేయడానికి చైనా దాకా వెళ్ళాడు. చైనాలో ఆ కోర్స్ పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చాడు. హైదరాబాదులో...

Most Popular

ISI Agents In India: అమాయక హిందువులే పాకిస్తాన్ ఐఎస్ఐ టార్గెట్.. ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందంటే..

ISI Agents In India: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నకిలీ నగదు.....

13-year-old boy : కమీషన్ ఇస్తేనే పనిచేస్తారా.. 13 ఏళ్ల బాలుడి ప్రశ్నకు కలెక్టర్ కు నోటి మాట...

13-year-old boy : అది కలెక్టర్ కార్యాలయం.. కలెక్టర్.. ఇతర అధికారులు ప్రజల సమస్యలు వింటున్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. వారంతా కూడా తమ సమస్యల మీద...

NITI Aayog Rankings : కాలం చెల్లిన గణాంకాలతో నీతి ఆయోగ్ ర్యాంకులు

NITI Aayog Rankings : కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణాయక సంస్థ 'నీతి ఆయోగ్' (NITI Aayog) రాష్ట్రాల ప్రగతిని అంచనా వేసేందుకు విడుదల చేసే నివేదికలు ఎల్లప్పుడూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా...

Cockroach Janata Party : చొచ్చుకొచ్చిన బొద్దింకలు.. దిగొస్తున్న బీజేపీ సర్కార్.. ఢిల్లీలో నాటకీయ పరిణామాలు

Cockroach Janata Party : దేశ రాజధాని ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీ నగరంలో పోలీసులు సహజంగానే ఆంక్షలు విధిస్తూ ఉంటారు. అయితే ఈసారి ఆ...

BJP Strategy In UP: యోగీ మూడోసారి పక్కా.. యూపీలో బీజేపీ పెద్ద వ్యూహమిదీ

BJP Strategy In UP:  ఉత్తరప్రదేశ్‌లో అధికారం చేజిక్కించుకోవడం దేశవ్యాప్తంగా పాలనా అధికారం కోసం పోటీపడే ఏ పార్టీకైనా అత్యంత కీలకమైన మెట్టు. ఈ రాష్ట్రం 80 లోక్‌సభ స్థానాలతో దేశంలోనే అత్యధిక...
Exit mobile version