Alcohol Consumption: దేశంలో అత్యధికంగా మద్యం తాగే రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీ పరిస్థితి ఏంటో తెలుసా?

మద్యపానం ఇప్పుడు సర్వ సాధారణం అయింది. పండుగైనా.. పబ్బమైనా..వేడుకైనా విషాదమైనా.. ఏదైనా మద్యం ఉండాల్సిందే. నూనూగు మీసాల కుర్రాళ్ల నుంచి పండు ముసలి వరకు మందు తాగుతున్నారు. పార్టీ కోసం కారణాలు వెతుక్కుంటున్నారు.

Written By: Raj Shekar, Updated On : August 29, 2024 4:01 pm

Alcohol Consumption

Follow us on

Alcohol Consumption: మందు పార్టీలు ఇప్పుడు కామన్‌ అయ్యాయి. ఒకప్పుడు పండుగలు, చుట్టాలు వచ్చినప్పుడు మాత్రమే మందు తాగేవారు. కానీ, క్రమంగా ఈ సంస్కృతి ప్రతీ రోజూ పండుగలా మాచ్చేసింది. పెరుగుతున్న ఆదాయం. ఏ విషయమైనా మందు తాగాలి అన్న పరిస్థితి వచ్చింది. దీంతోచిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ మందు తాగుతున్నారు. తెలంగాణ వచ్చాక.. ఏర్పడిన కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణలో మద్యం, మాంసం మన సంస్కృతిలో భాగం అన్నట్లు మార్చేశారు. దీంతో ఉమ్మడి ఏపీలో జరిగిన మద్యం అమ్మకాలను మించి తెలంగాణలో మద్యం అమ్మకాలు సాగడం మొదలయ్యాయి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో మద్యం కీలక పాత్ర పోషించింది అంటే తెలంగాణలో మద్యం అమ్మకాలు ఏమేర సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక దేశంలోనే తెలంగాణ మద్యపానంలో అగ్రస్థానంలో నిలిచింది. మద్యం సేవించే విషయంలో తెలుగు రాష్ట్రాల జనాభాకు ఎలాంటి భయాందోళనలు లేవనే వాస్తవాన్ని కాదనలేం. మద్యంపై తలసరి వార్షిక వ్యయంపై న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ (ఎన్‌ఐపిఎఫ్‌పి) అందించిన నివేదికను పరిశీలిస్తే అదే అర్థమవుతుంది.

అగ్రస్థానంలో తెలుగు రాష్ట్రాలు..
ఎన్‌ఐపీఎఫ్‌పీ నివేదిక ప్రకారం, సగటున మద్యంపై అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఉంది. తెలంగాణలో ప్రతి ఒక్కరూ మద్యం కోసం సంవత్సరానికి రూ.1,623 ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది. దేశంలో ఏ రాష్ట్రానికైనా ఇదే అత్యధికం. ఇక తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ఉంది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మద్యం కోసం ఏడాదికి రూ.1,306 ఖర్చు చేస్టున్నట్లు పేర్కొంది. మద్యంపై తెలంగాణ ఖర్చు 2014–15 ఆర్థిక సంవత్సరంలో రూ.745 నుంచి 2022–23 నాటికి రూ.1,623కి పెరిగింది. ఇదే కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ పెరుగుదల కనిపించింది, ఖర్చు రూ.365 నుంచి రూ.1,306కి పెరిగింది.

గోవా, కేరళలో తగ్గుదల..
ఇదిలా ఉంటే.. టూరిస్టు రాష్ట్రాలు అయిన గోవా, కేరళలో కూడా మద్యం అమ్మకాలు ఎక్కువగానే ఉంటాయి. అయితే స్థానికంగా మద్యం తాగేవారు తగ్గుతున్నట్లు ఎన్‌ఐపీఎఫ్‌పీ నివేదిక తెలిపింది. ఆ రాష్ట్రాలకు వెళ్లేవారు మద్యం తాగుతున్నారు. కానీ, స్థానికంగా నివాసం ఉండే ప్రజలు మద్యం తాగడం తగ్గిస్తున్నట్లు గుర్తించామని నివేదిక తెలిపింది. గత దశాబ్దంలో తిరోగమన ధోరణులు గుర్తించామని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలు మాత్రం మద్యం కోసం చేసే ఖర్చును మూడు రెట్లకు పెరిగింది.