Om Raut: ప్రభాస్ పరువు మరోసారి తీసేసిన ఆదిపురుష్ డైరెక్టర్.. ఇతనికి పిచ్చి ఇంకా తగ్గలేదు!

రామాయణం ని అపహాస్యం చేస్తూ, ఎన్నో ఘట్టాలను వక్రీకరించారని హిందూ సంఘాలు దేశ వ్యాప్తంగా నిరసనలు తెలియచేశాయి. డైరెక్టర్ ఓం రౌత్, ప్రభాస్ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోర్టులో పిటీషన్ కూడా వేశారు. ఇంత రచ్చ జరిగిన తర్వాత ఇప్పుడు ఓం రౌత్ తన రీసెంట్ ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు మరోసారి తీవ్రమైన ట్రోల్ల్స్ ని ప్రభాస్ ఎదురుకునేలా చేస్తున్నాయి.

Written By: Vicky, Updated On : August 29, 2024 4:12 pm

Om Raut

Follow us on

Om Raut: ప్రతీ స్టార్ హీరో కెరీర్ లోనూ తీపి జ్ఞాపకాలు ఇచ్చే సినిమాలు ఉంటాయి, అలాగే మర్చిపోలేని చేదు అనుభవాలను మిగిలించే సినిమాలు కూడా ఉంటాయి. అలా రెండు రకాల జ్ఞాపకాలను ప్రభాస్ తన అభిమానులకు చాలానే ఇచ్చాడు. ఆయన కెరీర్ లో ఒక మచ్చ లాగ మిగిలిపోయిన సినిమా ఏదైనా ఉందా అంటే మన అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు ‘ఆదిపురుష్’. ‘తానాజీ’ లాంటి సూపర్ హిట్ తర్వాత డైరెక్టర్ ఓం రౌత్ ప్రభాస్ తో చేసిన సినిమా ఇది. విడుదలకు ముందు నుండే ఈ చిత్రం పై అంచనాలు ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఉండేవి. కారణం రామాయణం ని భారీ బడ్జెట్ తో నిర్మించడం, ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రాముడి పాత్రలో కనిపించడమే. విడుదలకు ముందు పాటలు కూడా బాగా హిట్ అయ్యాయి. కానీ విడుదల తర్వాత మొదటి ఆట నుండే ఈ చిత్రం డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. ప్రభాస్ లుక్స్ దారుణంగా ట్రోల్ల్స్ కి గురి కాబడ్డాయి.

అంతే కాకుండా రామాయణం ని అపహాస్యం చేస్తూ, ఎన్నో ఘట్టాలను వక్రీకరించారని హిందూ సంఘాలు దేశ వ్యాప్తంగా నిరసనలు తెలియచేశాయి. డైరెక్టర్ ఓం రౌత్, ప్రభాస్ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోర్టులో పిటీషన్ కూడా వేశారు. ఇంత రచ్చ జరిగిన తర్వాత ఇప్పుడు ఓం రౌత్ తన రీసెంట్ ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు మరోసారి తీవ్రమైన ట్రోల్ల్స్ ని ప్రభాస్ ఎదురుకునేలా చేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే ‘ఇండియా లో ప్రభాస్, సల్మాన్ ఖాన్ ని మించిన బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఎక్కడా లేరు. వీళ్లిద్దరికీ ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా భారీ వసూళ్లు వస్తాయి. ఉదాహరణకి నేను ప్రభాస్ తో చేసిన ఆదిపురుష్ ని తీసుకోండి. ఈ చిత్రానికి మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ వచ్చింది, కానీ బాక్స్ ఆఫీస్ వద్ద 400 కోట్ల రూపాయిలకు పైగా గ్రాస్ ని రాబట్టి సూపర్ హిట్ గా నిల్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు.

‘ఆదిపురుష్’ చిత్రం 400 కోట్ల రూపాయిలకు పైగా వసూళ్లను రాబట్టిన విషయం నిజమే. కానీ ఆ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 600 కోట్ల రూపాయిలకు జరిగింది. అంటే ఈ చిత్రం ఫుల్ రన్ లో బయ్యర్లకు 200 కోట్ల రూపాయిలకు పైగా నష్టాలను తెచ్చిపెట్టింది అన్నమాట. ఇంత పెద్ద ఫ్లాప్ చిత్రాన్ని, సూపర్ హిట్ అని ఎలా అంటున్నావు?, ఈ జన్మకి మారే ఉద్దేశ్యమే లేదా నీకు, ప్రభాస్ స్టార్ స్టేటస్ ని సరిగ్గా ఉపయోగించుకొని ఈ సినిమాని నువ్వు తీసుంటే 2000 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఉండేది. అలాంటిది కేవలం 400 కోట్ల రూపాయిల గ్రాస్ దగ్గర సినిమా ఆగిందంటే అర్థం అవుతుందా నువ్వు ఎంత చెత్త సినిమా తీసావో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.