ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. డీఎస్సీ పరీక్ష ఎప్పుడంటే..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ వచ్చే ఏడాది డీఎస్సీ పరీక్షలను నిర్వహించాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విద్యాశాఖకు డీఎస్సీ పరీక్షలను నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. రాష్ట్రంలో వేల సంఖ్యలో నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురు చూస్తుండగా జగన్ సర్కార్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. 499 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..? ఏపీ విద్యాశాఖ ఇప్పటికే 13 జిల్లాల నుంచి […]

Written By: Navya, Updated On : December 23, 2020 12:15 pm
Follow us on


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ వచ్చే ఏడాది డీఎస్సీ పరీక్షలను నిర్వహించాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విద్యాశాఖకు డీఎస్సీ పరీక్షలను నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. రాష్ట్రంలో వేల సంఖ్యలో నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురు చూస్తుండగా జగన్ సర్కార్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. 499 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..?

ఏపీ విద్యాశాఖ ఇప్పటికే 13 జిల్లాల నుంచి ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను సేకరించింది. త్వరలో ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. తెలుస్తున్న సమాచారం మేరకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. జనవరిలోనే పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తున్నా ఇతర పోటీ పరీక్షలు ఉండటం వల్ల జనవరిలో పరీక్షల నిర్వహణ సాధ్యం కావడం లేదని తెలుస్తోంది.

Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. రాత పరీక్ష లేకుండా 50వేల వేతనంతో ఉద్యోగాలు..?

ఈసారి టెట్ పరీక్ష లేకుండా డీఎస్సీ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరో వారం రోజుల్లో టెట్ పరీక్ష ఉందో లేదో స్పష్టత రానుంది. జనవరి నెలలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలై దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభం కానుందని సమాచారం. విద్యాశాఖ 2018 డీఎస్సీలో మిగిలిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల ఖాళీలను కూడా భర్తీ చేయడానికి సిద్ధమవుతోంది.

మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఈ ఖాళీలను విద్యాశాఖ భర్తీ చేయనుంది. మొత్తం 403 ఖాళీలు ఉండగా విద్యాశాఖ ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ చేయనుంది. జగన్ సర్కార్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.