https://oktelugu.com/

పక్షం రోజుల్లోనే మరో లక్ష కేసులు?

దేశంలో కరోనా వ్యాప్తి రోజురోజుకూ విజృంభిస్తూనే ఉంది. గతంలో లక్ష కేసులు నమోదు కావడానికి 64 రోజులు సమయం పట్టింది. గడచిన వారం రోజుల్లోనే దేశంలో దాదాపు 45వేల పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఈ లెక్కన మరో 7 లేదా 8 రోజుల్లోనే 60వేల కేసులు నమోదయ్యే అవకశాలు ఉన్నాయి అంటే మరో లక్ష కేసులు నమోదు కావడానికి పెట్టె సమయం 15 రోజులే కావడం గమనార్హం. లాక్‌ డౌన్‌ ఆంక్షలు సడలించిన తర్వాత దేశంలో కరోనా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 27, 2020 11:33 am
    Follow us on

    దేశంలో కరోనా వ్యాప్తి రోజురోజుకూ విజృంభిస్తూనే ఉంది. గతంలో లక్ష కేసులు నమోదు కావడానికి 64 రోజులు సమయం పట్టింది. గడచిన వారం రోజుల్లోనే దేశంలో దాదాపు 45వేల పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఈ లెక్కన మరో 7 లేదా 8 రోజుల్లోనే 60వేల కేసులు నమోదయ్యే అవకశాలు ఉన్నాయి అంటే మరో లక్ష కేసులు నమోదు కావడానికి పెట్టె సమయం 15 రోజులే కావడం గమనార్హం. లాక్‌ డౌన్‌ ఆంక్షలు సడలించిన తర్వాత దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత ఐదు రోజులుగా దేశంలో నిత్యం ఆరు వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.

    గడిచిన 24 గంటల్లో దేశంలో 6,535 కేసులు నమోదు కాగా, 146 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,45,380కు చేరింది. వీరిలో 60,490 మంది కోలుకోగా.. 80,722 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక మరణాల సంఖ్య మొత్తం 4,167కి చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు.

    దేశంలో రికవరిరేటు 41.61శాతంగాను, మరణాల రేటు 2.87శాతంగా ఉన్నట్టు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మరణాలరేటు ఒక లక్ష జనాభాకు 4.4గా నమోదవుతుండగా, భారత్‌ లో లక్ష జనాభాలో 0.3గా నమోదవుతుందని చెప్పారు. ప్రపంచంతో పోలిస్తే.. మన దేశంలో చాలా తక్కువగా ఉందన్నారు. సరైన సమయంలో లాక్‌ డౌన్‌ నిర్ణయం తీసుకోవటంవల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. వలసకార్మికులు పెద్దఎత్తున తిరిగిరావటంతో అసోం కూడా వైరస్‌ వేగంగా పెరుగుతున్న రాష్ట్రాల సరసన చేరింది. మహారాష్ట్రలో వైరస్‌ తీవ్రత ఆందోళనకరస్థాయిలో ఉండగా తమిళనాడు, దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు ఈ మహమ్మారి తీవ్రత పెరుగుతున్నది.

    మహారాష్ట్రలో కరోనా పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. దేశంలో చోటుచేసుకఁన్న కరోనా మరణాల్లో 1,695 మరణాలతో ఆ రాష్ట్రం మొదటిస్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో గుజరాత్‌(888), మధ్యప్రదేశ్‌(300), పశ్చిమబెంగాల్‌(278), ఢిల్లీ(276)లు ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో రెండు, మూడు అంకెల్లో ఉన్న మరణాల సంఖ్య కేరళలో నాలుగ్గా ఉంది.

    కేసుల నమోదు గణాంకాలను పరిశీలిస్తే మహరాష్ట్రలో అధిక స్థాయిలో 52,667 పాజిటివ్‌ కేసులు తేలగా., ఆ సంఖ్య తమిళనాడులో 17,082, గుజరాత్‌ లో 14,460, ఢిల్లీలో 14,053, రాజస్థాన్‌ లో 7,300, మధ్యప్రదేశ్‌ లో 6,859, ఉత్తరప్రదేశ్‌ లో 6,532గా ఉంది.