10రోజుల్లోనే కరోనా కేసులు సంఖ్య రెట్టింపు!

భారత్ లో ఈ నెల(ఏప్రిల్) 9వ తేదీ నాటికి కరోనా కేసుల సంఖ్య 7వేలు దాటగా ఇప్పుడు ఆ కేసుల సంఖ్య 14వేలు దాటింది. అంటే గత 10 రోజుల్లోనే కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యాయి. గత 24 గంటల్లో 991 కేసులు నమోదు కావడంతో కోవిడ్-19 కేసుల సంఖ్య 14వేలు దాటింది. భారతదేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 14,378 అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఇందులో 11,906 యాక్టివ్ కేసులు […]

Written By: Neelambaram, Updated On : April 18, 2020 12:24 pm
Follow us on


భారత్ లో ఈ నెల(ఏప్రిల్) 9వ తేదీ నాటికి కరోనా కేసుల సంఖ్య 7వేలు దాటగా ఇప్పుడు ఆ కేసుల సంఖ్య 14వేలు దాటింది. అంటే గత 10 రోజుల్లోనే కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యాయి. గత 24 గంటల్లో 991 కేసులు నమోదు కావడంతో కోవిడ్-19 కేసుల సంఖ్య 14వేలు దాటింది.

భారతదేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 14,378 అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఇందులో 11,906 యాక్టివ్ కేసులు కాగా, 1992 మంది కోలుకున్నారు. 480 మంది చనిపోయారు.గత 24 గంటల్లో 991 కేసులు, 43 మరణాలు నమోదయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా 22,40,191 మంది కరోనావైరస్ బారినపడ్డారు. 1,53,822 మంది ప్రాణాలు విడిచారు. 5,68,343 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు.
అమెరికాలో కేసుల సంఖ్య 7 లక్షలకు సమీపంలో ఉంది. ఇప్పటివరకు 36,773 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలోని వుహాన్ ‌లో ఒక్కసారిగా మరణాల సంఖ్యలో 50శాతం పెరుగుదల నమోదైంది. దేశం మొత్తంగా 4,636 మంది చనిపోయారు. భారత్ ‌లో 14378 కేసులు నమోదయ్యాయి. 480 మంది మరణించారు.
కోవిడ్-19 కేసుల సంఖ్య ఆంధ్రప్రదేశ్‌ లో 603, తెలంగాణలో 766కు చేరుకుంది.