
రాష్ట్రంలో కోవిడ్ వారియర్ వాలంటీర్ల ను ఎంపికచేస్తున్నామని కోవిడ్ 19 స్పెషల్ ఆఫీసర్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇప్పటి వరకు కోవిడ్ వారియర్ గా పనిచేసేందుకు 2 వేల మంది దరఖాస్తులు అందాయని చెప్పారు.
రాష్ట్రంలో ని 271 మెడికల్, డెంటల్, యునాని, ఆయుర్వేద, నర్సింగ్ కళాశాలలకు చెందిన వారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కోవిడ్ వారియర్స్ గా సేవాలందించేవారికి భవిష్యత్తు లో ప్రభుత్వ నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1.46 కోట్ల కుటుంబాలు ఉన్నాయని, అందులో 1.42 కోట్ల కుటుంబాలను ప్రభుత్వం నియమించిన గ్రామ సేవకులు సర్వే చేసినట్లు చెప్పారు. ఈ రోజు వరకు 6289 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానించి వైద్యుల వద్దకు పంపటం జరిగిందని, అందులో 1750 మంది స్వీయ గృహనిర్భందం లో ఉంచి, 15 మందికి టెస్టులు చేయటం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వారు 474 వారం క్వారంటైన్ సెంటర్లను నిర్వహిస్తున్నారు.
కరోనా విపత్తును ఎదుర్కోవటానికి ఈ సెంటర్లలో 46,872 ప డకలను సిద్ధం చేశారు.రమారమి 24,537 అనుమానితులను స్వీయ గృహ నిర్బంధంలో ఉంచినట్లు తెలిపారు. ప్రస్తుతం 5635 ఈ సెంటర్లలో ఉన్నారన్నారు.